ఎందుకిలా…? ఏమైంది…?
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించింది. తిరుపతి అభ్యర్థిగా ప్రకటించి చంద్రబాబు దాదాపు [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించింది. తిరుపతి అభ్యర్థిగా ప్రకటించి చంద్రబాబు దాదాపు [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించింది. తిరుపతి అభ్యర్థిగా ప్రకటించి చంద్రబాబు దాదాపు రెండు నెలలు కావస్తుంది. ఇప్పటి వరకూ పనబాక లక్ష్మి ఒక్కసారి మాత్రమే తిరుపతి వచ్చారు. ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పనబాక లక్ష్మి పాల్గొనడం లేదు. ఇది పార్టీలో చర్చనీయాంశమైంది. పనబాక లక్ష్మి పోటీకి అయిష్టత వ్యక్తం చేస్తున్నారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
రెండు నెలలవుతున్నా…..
పనబాక లక్ష్మిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించి రెండు నెలలు కావస్తుంది. జనవరి 17 నుంచి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఇటీవల ప్రారంభించారు. అయితే పనబాక లక్ష్మి జాడ మాత్రం లేదు. ఆమె పార్టీ కార్యక్రమాలకు, ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండటానికి కారణాలపై టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. చంద్రబాబు సూచన మేరకు ఇటీవల కొందరు సీనియర్ నేతలు ఆమెను కలసి పరిస్థితిపై చర్చించినట్లు తెలిసింది.
పైసా కూడా పెట్టనంటూ…..
తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని,కుమార్తె పెళ్లి కూడాచేశానని, ఈ సమయంలో ఎన్నికల ఖర్చును తాను భరించే స్థితిలో లేనని పనబాక లక్ష్మి చెప్పినట్లే టీడీపీ సర్కిళ్లలో విన్పిస్తున్న టాక్. తాను ప్రచారానికి వెళ్లాలన్నా అయ్యే ఖర్చుకు భయపడి రావడం లేదని ఆమె చెప్పడంతో సీనియర్ నేతలు సయతం విస్తుపోయినట్లు తెలుస్తోంది. మొత్తం ఖర్చు పార్టీయే భరిస్తానంటేనే తాను ముందుకు వస్తానని కూడా పనబాక లక్ష్మి తెగేసి చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది.
పంచాయతీ ఎన్నికల తర్వాత…..
గెలుస్తామన్న నమ్మకం లేనప్పుడు ఎందుకు ఖర్చు చేయాలన్న ఉద్దేశ్యంలో పనబాక లక్ష్మి ఉన్నారట. అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయిన తర్వాత మాత్రమే తాను స్వయంగా చంద్రబాబును కలసి తన పరిస్థితిని వివరించాలని పనబాక లక్ష్మి భావిస్తున్నారు. తిరుపతి టీడీపీ నేతలు కూడా పనబాక లక్ష్యిని లైట్ గా తీసుకుంటున్నారట. ఆమె వచ్చినప్పడే చూద్దాంలే అన్న ధోరణి వారిలో కన్పిస్తుంది. పంచాయతీ ఎన్నికలు మొత్తం ముగిసిన తర్వాత పనబాక లక్ష్మి పోటీపై క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.