టీడీపీకి జనసేన, వైసీపీకి సీపీఎం మద్దతు.. గ్రౌండ్ లో జరిగేదేంటి ?
ఏడాదికాలం పాటు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్ సర్కారు నేతృత్వంలో వచ్చిన ఈ ఎన్నికలు గత ఏడాది ప్రారంభమై.. మధ్యలోనే నిలిచిపోయాయి. [more]
ఏడాదికాలం పాటు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్ సర్కారు నేతృత్వంలో వచ్చిన ఈ ఎన్నికలు గత ఏడాది ప్రారంభమై.. మధ్యలోనే నిలిచిపోయాయి. [more]
ఏడాదికాలం పాటు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్ సర్కారు నేతృత్వంలో వచ్చిన ఈ ఎన్నికలు గత ఏడాది ప్రారంభమై.. మధ్యలోనే నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రధానంగా భావిస్తున్నాయి. పైగా జగన్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉన్న పార్టీలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో మంచి కేడర్ ఉన్న సీపీఎం అధికార పార్టీ వైసీపీకి మద్దతుగా నిలుస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
క్షేత్రస్థాయిలో మద్దతు….
కమ్యూనిస్టు పార్టీలో సీపీఐ ఒంటరిగా వెళ్తున్నా.. టీడీపీకి లోపాయికారీగా మద్దతు ఇస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీకి సీపీఎం క్షేత్రస్థాయిలో మద్దతిచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక, మరో కీలక పార్టీగా ఉన్న జనసేన దాదాపు అభ్యర్థులు లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పాత మిత్రుడు టీడీపీకి మద్దతిచ్చే అంశాన్ని లోపాయికారీ నాయకులు చర్చ చేస్తున్నారు. వాస్తవానికి పైకి మాత్రం బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో ఆపార్టీతోనే ముందుకు సాగాలని అనుకున్నా.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కీలక ఎన్నికలకు బీజేపీతో కలిసి వెళ్లాలని.. తమతోపాటు బీజేపీకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో బలం లేదని.. ఈ నేపథ్యంలో బీజేపీకి మద్దతిచ్చి ప్రయోజనం ఏంటని జనసేన నాయకులు అభిప్రాయ పడుతున్నారు.
రాజకీయ సమీకరణాలకు….?
ఈ నేపథ్యంలో అసలు పోటీకి దూరంగా ఉంటే.. ఇది వైసీపీకి బలం చేకూరుతుందని.. దీంతో టీడీపీకి మద్దతివ్వడం ద్వారా.. అనుకున్న లక్ష్యాన్ని (వైసీపీ దూకుడును నిలువరించడం) సాధించవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీడీపీ కూడా కలిసి వచ్చే పార్టీలవైపు చూస్తోంది. నగరాలు, పట్టణాల్లో పార్టీకి బలం ఉన్నప్పటికీ.. గ్రామ స్థాయిలో మాత్రం పార్టీ ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో భేషజాలకు తావివ్వకుండా.. కలిసి వచ్చే పార్టీలను బలోపేతం చేసుకుని ముందుకు సాగాలని భావిస్తోంది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలు మరో సార్వత్రిక సమరాన్ని తలపిస్తాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ పంచాయతీ ఎలాంటి రాజకీయ సమీకరణలకు, మార్పులకు వేదిక అవుతుందో చూడాలి.