పండులకు అలా పండగయిందే?
రాజకీయాల్లో ఓపిక పట్టడమే సానుకూల అంశం. తొందరపడకుండా వెయిట్ చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్నది వాస్తవం. మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు విషయంలో ఈ [more]
రాజకీయాల్లో ఓపిక పట్టడమే సానుకూల అంశం. తొందరపడకుండా వెయిట్ చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్నది వాస్తవం. మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు విషయంలో ఈ [more]
రాజకీయాల్లో ఓపిక పట్టడమే సానుకూల అంశం. తొందరపడకుండా వెయిట్ చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్నది వాస్తవం. మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు విషయంలో ఈ విషయం స్పష్టమయింది. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి అమలాపురం పార్లమెంటు నుంచి గెలిచారు. ఆ తర్వా త ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ సందర్భంగా జగన్ పండుల రవీంద్ర బాబుకు హామీ ఇచ్చారు. ఆ హామీతోనే ప్రభుత్వం వచ్చిన ఏడాది లోగానే పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
ఐఆర్ఎస్ అధికారిగా….
పండుల రవీంద్రబాబు పశ్చి మ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన వారు . ఆయన ఐఆర్ఎస్ అధికారి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యా వంతుడు కావడంతో తెలుగుదేశం పార్టీ ఆయనకు అవకాశమిచ్చింది. . ఏ విషయంపైనైనా పూర్తి అవగాహనతో మాట్లాడగలిగిన నాయకుడిగా పండుల రవీంద్రబాబుకు పేరుంది. అయితే అప్పట్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పండుల రవీంద్ర బాబుతో పాటు అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరడంతో పార్టీకి మంచి హైప్ వచ్చింది.
అంబాజీ పేట సభలో…..
అయితే గత ఎన్నికల సమయంలో ఆయనకు వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు పండుల రవీంద్ర బాబుకు గవర్నర్ కోటాలో జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అంబాజీ పేట బహిరంగ సభలో జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఒకదశలో పండుల రవీంద్రబాబు తిరిగి తెలుగుదేశం పార్టీ గూటికి వెళతారన్న ప్రచారం జరిగింది.
రెండు స్థానాల్లో…..
కానీ పండుల రవీంద్ర బాబు వైసీపీలోనే కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయానికి కూడా కృషి చేశారు. గవర్నర్ కోటాలో భర్తీ కానున్న రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి పండుల రవీంద్ర బాబుకు ఇవ్వడం దళిత సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వమేనంటున్నారు ఆయన సన్నిహితులు. శాసనమండలి ఎన్నాళ్లు ఉంటుందన్న విషయం పక్కన పెడితే పండుల రవీంద్ర బాబుకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారన్నది వాస్తవం.