పరిస్థితి ఏందప్పా…?
కొడుకు రవీంద్రనాధ్ కుమార్ రాజకీయాల్లోకి తేవడానికి తండ్రి పన్నీర్ సెల్వం బాగానే కష్టపడ్డారు. ఇప్పటికే పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి జయలలితకు నమ్మకమైన నేతగా పేరుపొందారు. [more]
కొడుకు రవీంద్రనాధ్ కుమార్ రాజకీయాల్లోకి తేవడానికి తండ్రి పన్నీర్ సెల్వం బాగానే కష్టపడ్డారు. ఇప్పటికే పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి జయలలితకు నమ్మకమైన నేతగా పేరుపొందారు. [more]
కొడుకు రవీంద్రనాధ్ కుమార్ రాజకీయాల్లోకి తేవడానికి తండ్రి పన్నీర్ సెల్వం బాగానే కష్టపడ్డారు. ఇప్పటికే పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి జయలలితకు నమ్మకమైన నేతగా పేరుపొందారు. జయలలిత మరణించే సమయంలోనూ పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా జయలలిత నియమించారు. అయితే ఆమె మరణం తర్వాత మాత్రం జయలలిత ఆలోచనలను పక్కన పెట్టి పళనిస్వామిని శశికళ ముఖ్యమంత్రిని చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ కలసి శశికళను పక్కన పెట్టారు.
గెలిపించుకున్నా….
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పన్నీర్ సెల్వం తన కుమారుడు రవీంద్రనాధ్ కుమార్ ను తేని నియోజకవర్గం నుంచి పట్టుబట్టి పోటీకి నిలబెట్టారు. మిగిలిన నియోజకవర్గాలను వదిలిపెట్టి పన్నీర్ సెల్వం తేనిపైనే దృష్టి పెట్టారు. ఎట్టకేలకు రవీంద్రనాధ్ కుమార్ గెలుపొందారు. బీజేపీ ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడంతో అన్నాడీఎంకే కు కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించాలని పన్నీర్ సెల్వం తెగ ప్రయత్నించారు. అదే జరిగితే తన కుమారుడు కేంద్రమంత్రి అవుతారని భావించారు.
కేంద్రమంత్రి వర్గంలో….
దీనిపై పళనిస్వామి వర్గం గుర్రుమంది. పన్నీర్ సెల్వం పై ఎప్పటి నుంచో ఆగ్రహంతో ఉన్న పళనివర్గం కేంద్రమంత్రి పదవులు తమకు అక్కరలేదని బీజేపీకి సంకేతాలను పంపింది. ఇదిలా ఉండగా బీజేపీ పెద్దలతో పన్నీర్ సెల్వం రహస్య సమావేశాలు జరపడంపై పళనివర్గం అప్రమత్తమయింది. తనకు పార్టీలోకీలక పదవి గాని, ముఖ్యమంత్రి పదవి గాని ఇవ్వాలని బీజేపీ పెద్దల వద్ద పన్నీర్ సెల్వం ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. దీంతో రెండు వర్గాల మధ్య మరింత గ్యాప్ ఏర్పడిందంటున్నారు.
ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లడంతో….
తాజాగా ముఖ్యమంత్రి పళనిస్వామి పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. దాదాపు పదిరోజుల పాటు ముఖ్యమంత్రి విదేశాల్లో ఉంటారు. అయితే తాత్కాలిక బాధ్యతలు పన్నీర్ సెల్వానికి అప్పగించకపోవడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాధ్ కుమార్ తేనె నియోజకవర్గానికి వచ్చిన డీఎంకే నేత దురై మురుగన్ కలిసి ఆయనను సన్మానించడమూ వివాదంగా మారింది. మొత్తం మీద పళనిస్వామి విదేశీ పర్యటనకు వెళుతూ పన్నీర్ సెల్వంకు బాధ్యతలను అప్పగించకపోవడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నారు. ఇటు కేంద్రం నుంచి తనకు పూర్తి స్థాయి హామీ లేకపోవడం, పళనిస్వామి పక్కన పెట్టడంతో పన్నీర్ సెల్వం పరిస్థితి ఏంటన్నది అర్థం కాకుండా ఉంది.