వైసిపి కి శాపంగా మారుతున్న ఎంపి లు ?
వైసీసీకి ఎంపీలు అచ్చిరానట్లే కనిపిస్తుంది. పార్టీ స్థాపించి న తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలిచినా అందులో ముగ్గురు సొంత పార్టీలో ఉంటూనే [more]
వైసీసీకి ఎంపీలు అచ్చిరానట్లే కనిపిస్తుంది. పార్టీ స్థాపించి న తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలిచినా అందులో ముగ్గురు సొంత పార్టీలో ఉంటూనే [more]
వైసీసీకి ఎంపీలు అచ్చిరానట్లే కనిపిస్తుంది. పార్టీ స్థాపించి న తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలిచినా అందులో ముగ్గురు సొంత పార్టీలో ఉంటూనే పక్క పార్టీకి జై కొట్టి వింత రాజకీయాలకు గత ప్రభుత్వంలో తెరతీశారు. బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత గతంలో ఏమి చేశారో అందరికి తెలిసిందే. అదే రీతి కాకపోయినా ప్రస్తుతం మరో కొత్త తరహాలో నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజు నవ రాజకీయాన్ని మొదలు పెట్టారు. అధికారపార్టీలో వారికి రాజు ఇప్పుడు చెమటలు పట్టిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ ఛానెల్స్ లో రోజు ఆయన చేసే గోలకు జగన్ పార్టీ గందరగోళానికి గురౌతుంది. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పడిన క్షోభ వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అనుభవిస్తూ ఉండటంతో లోపం ఎక్కడ ఉంది ? శాపం ఎవరిదీ అనే చర్చ జోరుగా సాగుతుంది.
రామ రామ ..
గెలిచిన పార్టీకి పంగనామాలు పెట్టడమే కాకుండా ఆ పార్టీ పరువును అందులో ఉంటూనే రోడ్డున పెట్టడం అన్నది తాజా రాజకీయాల్లో ఒక ట్రెండ్ గా మొదలైంది. దీనికి జగన్ ధోరణి కారణమా ? బిజెపి ప్రాంతీయ పార్టీలను అస్థిర పరిచే వ్యూహమా ?లేక ప్రత్యర్థి టిడిపి ఎత్తుగడలకు ప్రలోభాలకు అధికారపార్టీని ధిక్కరించి మరీ నేతలు ఎదురు తిరుగుతున్నారా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
అదే మెజారిటీ లేకుంటే….?
ప్రస్తుతానికి కేంద్రంలో మోడీ సర్కార్ కి పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఏ పార్టీనుంచి ఆపరేషన్ ఆకర్ష్ చేయాలిసిన పని కమలానికి లేదు. అయితే రాజ్యసభ కు తమ సంఖ్యా బలం తక్కువ ఉండటంతో కొందరికి గాలం వేసి ముందే సుజనా వంటివారిని లాగేసింది కేంద్రం. అదే లోక్ సభ సభ్యుల బలం తక్కువ ఉంటె టిడిపి కి వున్న ముగ్గురు ఎంపీ లు వైసిపి లో సగం మంది చక్కగా ఈ పాటికే గోడ దూకేసి పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.