కిక్కురుమనడం లేదు.. ఎందుకంటే…?
అనంతపురం జిల్లాలో ఒకప్పుడు కీలకంగా చక్రం తిప్పిన రాజకీయ కుటుంబం పరిటాల ఫ్యామిలీ. పరిటాల రవితో ప్రారంభమైన రాజకీయాలు.. ఆయన అనంతరం సతీమణి.. సునీతతోనూ ఇప్పుడు ఆయన [more]
అనంతపురం జిల్లాలో ఒకప్పుడు కీలకంగా చక్రం తిప్పిన రాజకీయ కుటుంబం పరిటాల ఫ్యామిలీ. పరిటాల రవితో ప్రారంభమైన రాజకీయాలు.. ఆయన అనంతరం సతీమణి.. సునీతతోనూ ఇప్పుడు ఆయన [more]
అనంతపురం జిల్లాలో ఒకప్పుడు కీలకంగా చక్రం తిప్పిన రాజకీయ కుటుంబం పరిటాల ఫ్యామిలీ. పరిటాల రవితో ప్రారంభమైన రాజకీయాలు.. ఆయన అనంతరం సతీమణి.. సునీతతోనూ ఇప్పుడు ఆయన కుమారుడు శ్రీరాం వరకు కూడా కొనసాగుతున్నాయి. పెనుగొండ, రాప్తాడు నియోజకవర్గాల నుంచి సునీత మూడు సార్లు గెలిచి.. గత చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా చక్రం తిప్పారు. అయితే.. గత ఏడాది ఎన్నికల్లో మాత్రం సునీత తన కుమారుడు శ్రీరాంను రాజకీయంగా నిలబెట్టి.. గెలిపించుకునేందుకు ప్రయత్నించారు. కానీ, ఈ పోరులో ఓటమి పాలయ్యారు.
గెలుపోటములు సహజమే అయినా….
సరే! గెలుపు ఓటములు అనేవి ఎక్కడైనా ఎప్పుడైనా సహజమే. అంతమాత్రాన ఎవరూ రాజకీయాలకు దూరంకారు. కానీ, పరిటాల ఫ్యామిలీలో మాజీ మంత్రి సునీత కానీ, ఓడిపోయిన యువ నాయకుడు శ్రీరాం కానీ.. ఎక్కడా రాజకీయ పరమైన దూకుడు చూపించలేకపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. టీడీపీ తరఫున తమ వాయిస్‌ను వినిపించడం లేదు. అసలు ఇంటి గడప కూడా దాటటడం లేదు. మరి ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా కేసులు పెడుతుందని భయమా ? లేక ప్రజలు తమను ఓడించారని ఆవేదనా ? అంటే.. కాదని అంటున్నారు పరిశీలకులు. సొంత పార్టీ అధినేత చద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపైనే వారు ఆవేదనతో ఉన్నారని చెబుతున్నారు.
బాబు వైఖరితోనే….
గత ఏడాది ఎన్నికలకు ముందు నుంచి చంద్రబాబు వైఖరిపై ఒకింత బాధతోనే ఉన్నారని తెలుస్తోంది. అంటే.. తమకు గత ఎన్నికల్లోనే రెండు టికెట్ లు కావాలని సునీత, శ్రీరామ్ అడిగారు. అంటే.. అప్పటికి మంత్రిగా ఉన్న సునీత రాప్తాడు నుంచి పోటీ చేయడం, ధర్మవరం నుంచి శ్రీరాంను పోటీచేయించాలని అనుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ధర్మవరం రాజకీయాల్లో వేలు పెట్టేందుకు సునీత చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ, చంద్రబాబు మాత్రం ధర్మవరం సీటు ఇవ్వలేదు. దీంతో సునీత ఏకంగా పోటీ నుంచి తప్పుకొని.. శ్రీరాంకు అవకాశం ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. ఓటమి తర్వాత అయినా.. తమకు పెనుకొండ ఇవ్వాలని, రవి అనేకసార్లు ఇక్కడ నుంచి గెలిచారని పరిటాల సునీత, శ్రీరామ్ బాబుపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు.
అందుకే సైలెంట్ అట….
కానీ, చంద్రబాబు మాత్రం పెనుగొండ విషయాన్ని పక్కన పెట్టి.. ధర్మవరం అయితే ఓకే.. అంటున్నారు. ఇటీవల ఇక్కడి నాయకుడు వరదాపురం సూరి.. బీజేపీలోకి జంప్ చేసిన నేపథ్యంలో ఇది ఖాళీ అయిందని .. సో.. ఇక్కడకు వెల్లాలని చంద్రబాబు సూచిస్తున్నారు. కానీ, పరిటాల ఫ్యామిలీ మాత్రం.. పెనుకొండే కావాలని పట్టుబడుతోంది. అయితే అక్కడ బీసీ నేత పార్థసారథి ఉన్నారు. ఆయన బాబుకు అత్యంత ఇష్టుడు. ఆయన్ను తప్పించే పరిస్థితే లేదని బాబు కుండబద్దలు కొడుతున్నారట. ఈనేపథ్యంలో బాబుకు, పరిటాల ఫ్యామిలీకి మధ్య మౌన వివాదాలు నడుస్తున్నాయి. ఈ కారణంగానే పరిటాల ఫ్యామిలీ సైలెంట్ అయిందని తెలుస్తోంది.