ఈ రెండు పార్టీల్లో ఆ పదవి ఉన్నా వేస్టేనట
వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ఇబ్బంది పడుతున్నారు. జాతీయ పార్టీలో ఉన్నంత హ్యాపీగా ప్రాంతీయ పార్టీల్లో ఉండలేకపోతున్నారు. జాతీయ పార్టీలలో ఎంపీ అయితే ఢిల్లీ స్థాయిలో అధిష్టానానికి దగ్గరగా [more]
వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ఇబ్బంది పడుతున్నారు. జాతీయ పార్టీలో ఉన్నంత హ్యాపీగా ప్రాంతీయ పార్టీల్లో ఉండలేకపోతున్నారు. జాతీయ పార్టీలలో ఎంపీ అయితే ఢిల్లీ స్థాయిలో అధిష్టానానికి దగ్గరగా [more]
వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ఇబ్బంది పడుతున్నారు. జాతీయ పార్టీలో ఉన్నంత హ్యాపీగా ప్రాంతీయ పార్టీల్లో ఉండలేకపోతున్నారు. జాతీయ పార్టీలలో ఎంపీ అయితే ఢిల్లీ స్థాయిలో అధిష్టానానికి దగ్గరగా ఉంటారు. అందుకే కొంత ఎమ్మెల్యేలకు పార్లమెంటు సభ్యులంటే ఒకింత భయం, గౌరవం ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ పార్లమెంటు సభ్యులకు గతంలో ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురుకాలేదు. ఎంపీ ల్యాడ్స్ నిధుల కోసం పార్లమెంటు సభ్యుల చుట్టూ ఎమ్మెల్యేలు కాళ్లరిగేలా తిరిగేవారు.
కాంగ్రెస్ ఎంపీలుగా…..
కాంగ్రెస్ 2004, 2009 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది. అప్పుడు కాంగ్రెస్ ఎంపీలే నియోజకవర్గాల్లో ఆధిపత్యం చేసేవారు. పార్లమెంటు నియోజవకర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎంపీలు తమకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకునేవారు. వాళ్లు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో హవా చూపేవారు. ఎంపీ తమ నియోజకవర్గంలో పర్యటించడం కోసం ఎమ్మెల్యేలు ఉత్సుకతతో ఎదురు చూసేవారు. ఆయన అపాయింట్ మెంట్ కోసం వెంపర్లాడేవారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు…..
కానీ 2014 నుంచి ఏపీలో ఎంపీల పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలతో చాలా ఇబ్బంది పడేవారు. తమ నియోజకవర్గాల్లో వేలు పడితే ఒప్పుకునే వారు కారు. కనీసం తమ నియోజకవర్గాల్లో పర్యటించమని కోరడం కూడా జరిగేది కాదు. ముఖ్యమంత్రి పర్యటన ఉంటేనే తప్ప వేదికలపై ఎంపీలకు చోటు ఉండేది కాదు. ఎంపీ ల్యాడ్స్ ను కూడా ఎమ్మెల్యేలు లైట్ గా తీసుకున్నారు. కేశినేని నాని, మురళీ మోహన్, శివప్రసాద్ వంటి ఎంపీలు అప్పట్లో ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అప్పట్లో చంద్రబాబుకు అనేకమంది ఎంపీలు వ్యక్తిగతంగా కలసి ఫిర్యాదు చేసినా అంతే.
ఇప్పుడు వైసీపీలోనూ……
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చినా ఎంపీల పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. అనేకమంది ఎంపీలు ఎమ్మెల్యేలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎంపీలు ఎక్కడ వచ్చి తమ నియోజకవర్గాల్లో వచ్చి తిష్ట వేస్తారోనన్న భయం ఎమ్మెల్యేలకు ఉండటమే ఇందుకు కారణం. పైగా పార్టీ హైకమాండ్ ఇక్కడే ఉండటం, జగన్ కూడా ఎంపీలను పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేలు ఎంపీలను పూచికపుల్లతో సమానంగా చూస్తున్నారు. ఎంపీలు లావు కృష్ణ దేవరాయలు, మార్గాని భరత్, మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్ వంటి వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఎంపీలుగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి, బాలశౌరిలకు జాతీయ పార్టీల్లో ఎంపీగా ఉండే గుర్తింపు, గౌరవం ప్రాంతీయ పార్టీలో లేకపోవడం స్పష్టంగా తెలుస్తోంది.