ఢీ కొట్టడానికి రెడీ అయ్యారా?
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో కీలక అంశాలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక [more]
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో కీలక అంశాలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక [more]
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో కీలక అంశాలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. మోదీ సర్కార్ వైఫల్యంపై పార్లమెంటు సమావేశాల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీయేతర పార్టీలన్నింటినీ కూడగట్టే ప్రయత్నం చేయాలని భావించింది.
కరోనా తో కుదేలయి…..
కరోనా ఎఫెక్ట్ తో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. దీనికితోడు జీఎస్టీ విషయంలో పరిమితులు కేంద్రం విధించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. కరోనాను కట్టడి చేయడంలోనూ, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలోనూ మోదీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ అభిప్రాయపడుతుంది. కరోనా సమయంలో సక్రమంగా డీల్ చేయకపోవడంతో ఆ ఎఫెక్ట్ రానున్న పదేళ్ల కాలంపై పడుతుందని కాంగ్రెస్ చెబుతోంది.
సరిహద్దు రక్షణలో…..
ఇక సరిహద్దుల్లో భారత్ – చైనా చేస్తున్న విన్యాసాలను కూడా కాంగ్రెస్ తప్పుపడుతోంది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ఖచ్చితమైన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా దాచిపెడుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అంతే కాకుండా సరిహద్దు రక్షణలో మోదీ ప్రభుత్వం విఫలమయిందని కూడా ఆరోపిస్తుంది. జీఎస్టీ పరిహారం విషయంలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుండటంతో వివిధ పార్టీలను ఏకం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది.
నేతలకు దిశానిర్దేశం…..
అంతేకాకుండా వివిధ అంశాలపై ఎవరెవరు మాట్లాడాలన్నది ముందుగానే కాంగ్రెస్ నిర్ణయించింది. రాజ్యసభ, లోక్ సభల్లో పార్టీ గళాన్ని పూర్తిగా విన్పించాలని సోనియా పార్టీ నేతలను ఆదేశించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్ కు జరుగుతున్న నష్టాన్ని కూడా వివరించాలని సోనియా నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ బీజేపీని ఢీకొట్టేందుకు సిద్ధమయింది. సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి.