Pattabhi : ఏపీ అంటే పట్టాభి అట.. అంతా ఆయన చుట్టూనే?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నీచంగా మారుతున్నాయి. ఒక స్థాయిలేని వ్యక్తి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రజాసమస్యల కంటే పట్టాభి వైపే రాజకీయ పార్టీలు, అనుకూల మీడియాలు మొగ్గు చూపుతున్నాయి. పట్టాభి [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నీచంగా మారుతున్నాయి. ఒక స్థాయిలేని వ్యక్తి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రజాసమస్యల కంటే పట్టాభి వైపే రాజకీయ పార్టీలు, అనుకూల మీడియాలు మొగ్గు చూపుతున్నాయి. పట్టాభి [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నీచంగా మారుతున్నాయి. ఒక స్థాయిలేని వ్యక్తి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రజాసమస్యల కంటే పట్టాభి వైపే రాజకీయ పార్టీలు, అనుకూల మీడియాలు మొగ్గు చూపుతున్నాయి. పట్టాభి విడుదలయ్యాడు. పట్టాభిని పోలీసులు అడ్డుకున్నారు. పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లాడు. పట్టాభిని మళ్లీ అరెస్ట్ చేస్తారా? ఏపీ అంటే మీడియా పట్టాభిగా మార్చేసింది. ప్రజలకు పట్టాభి తప్ప మరొకటి తెలియకుండా చేస్తుంది.
మామూలు నేతగా….
పట్టాభి ఒక పార్టీలో మమూలు నేత. బూతులు తిట్టడంలో ప్రావీణ్యత సంపాదించిన పట్టాభి ఆ పదాల నుంచే అనేక పదవులు పొందారు. 2014 లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పట్టాభి పేరు ఎక్కడా విన్పించలేదు. అసలు ఆయన ఒకరు ఉన్నట్లే టీడీపీ నేతలకు కూడా తెలియదు. ఐదేళ్లు పట్టాభి టీడీపీ కార్యాలయంలోనే ఉన్నా బయటకు కన్పించలేదు. అంటే ఆయనను ఎవరూ పట్టించుకోలేదన్న మాట.
అధికారాన్ని కోల్పోయిన తర్వాత…
టీడీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత అప్పటి వరకూ పదవులు అనుభవించిన నేతలు గొంతులు మూగపోయాయి. పార్టీని పట్టించుకోవడం మానేశారు. ఈ పరిస్థితి పట్టాభి తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. ఆధారాలంటూ కాగితాలు చూపించి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మొదలెట్టారు. దీంతో చంద్రబాబు, లోకేష్ కంట్లో పడ్డారు. పట్టాభికి తెలుసు. తనకు ఇది సరైన సమయమని భావించిన పట్టాభి వైసీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టి జాతీయ అధికార ప్రతినిధి హోదాను పొందగలిగారు.
గాలి మాటల….
ఇక మొన్న పట్టాభి ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. చంద్రబాబు తన 36 గంటల దీక్షలో కూడా పట్టాభి నామస్మరణ చేసి పార్టీలో ఆయనకు ఒక స్థానం కల్పించారు. ఇప్పుడు టీడీపీ అంటే పట్టాభిలా మారిపోయింది. ఆయన అడుగు బయటకు వేస్తే ఫ్లాష్ లు మెరుస్తున్నాయి. వైసీపీ నేతలు కూడా పట్టాభిని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా పరిచయం చేయగలిగారు. సో.. ఇప్పుడు ఏపీకి పట్టాభి మ్యానియా పట్టుకుంది. ప్రజా సమస్యలను గాలికి వదలేసి గాలి కబుర్లు చెప్పే పట్టాభి చుట్టూనే మీడియా తిరుగుతుంది. బోస్ డీకే అన్న పదం పట్టాభి రాజకీయ జీవితాన్నే మార్చేసింది.