త్వరలో ఆ పార్టీ తో పవన్ మళ్ళీ దోస్తీ …?
పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా జనసేన ను వ్యూహాత్మకంగా ముందుకు నడిపే పనిలో పడ్డారు. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే తన పార్టీ రాజకీయాలకు పదును [more]
పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా జనసేన ను వ్యూహాత్మకంగా ముందుకు నడిపే పనిలో పడ్డారు. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే తన పార్టీ రాజకీయాలకు పదును [more]
పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా జనసేన ను వ్యూహాత్మకంగా ముందుకు నడిపే పనిలో పడ్డారు. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే తన పార్టీ రాజకీయాలకు పదును పెట్టేస్తున్నారు. తిరుపతి ఎన్నికల్లో బిజెపి చవిచూసిన పరాజయం తరువాత అసలే అంతంత మాత్రంగా ఉన్న కమలంతో దోస్తీ కి మంచి ముహర్తం చూసి కటీఫ్ కొట్టేయడమే బెటర్ అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని వదిలి పెట్టి రావడం ఒకరకంగా కొంత కష్టమైన పనే అయినప్పటికీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందుగా ఈ విడాకులు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రెడీ గా ఉన్న బాబు …
జనసేనను విడిచి వెళితే ఎలాంటి దుష్పలితాలు వస్తాయో టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా గత ఎన్నికల్లో అర్ధం చేసుకున్నారు. ఎప్పుడు పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని బాబు గత ఎన్నికల్లో అతి విశ్వాసానికి పోయి ఒక పక్క బిజెపి ని మరోపక్క పవన్ కళ్యాణ్ తోనూ కలిసి వెళ్లకుండా ఘోరంగా దెబ్బ తిన్నారు. అయితే ఎలాంటి దిక్కుమాలిన పరిస్థితి వచ్చినా 30 శాతానికి పైబడే టిడిపి ఓటు బ్యాంక్ పలు ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు జనసేన, అటు కలిసి వస్తే బిజెపి లతో దోస్తీ కట్టడం లేదా బిజెపి ని వదిలి అయినా పవన్ కళ్యాణ్ తో ప్రయాణించేందుకు చంద్రబాబు రెడీ గా ఉన్నారు.జనసేన కలిస్తే మరో ఏడు నుంచి 10 శాతం ఓట్లు కలుస్తాయని దీనికి బిజెపి కూడా జత కలిస్తే ఫ్యాన్ రెక్కలు విరిచేంత బలం పుంజుకుంటుందన్నది బాబు ఆలోచన అంటున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పెరుగుతుందని వీటన్నిటి శాతం పెరిగితే అధికారానికి చాలా దగ్గర అవుతామన్నది ఆయన అంచనా అని ఆ పార్టీ వర్గాల్లో నడుస్తుంది.
పార్టీ నిర్మాణం పై పవన్ గట్టి ఫోకస్ …
అదే రీతిలో పవన్ కళ్యాణ్ సైతం లెక్కలు వేసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయన గతం లో లేని విధంగా పార్టీ నిర్మాణం పై శ్రద్ధ పెట్టారు. కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలు ముఖ్యంగా ఉభయగోదావరి, విశాఖలపై పవన్ కళ్యాణ్ పార్టీ ఫోకస్ పెంచినట్లు తెలుస్తుంది. ఇక్కడ బలమైన జనసేన అభ్యర్థులకు టిక్కెట్లు ఇప్పించేలా ఒప్పందం చేసుకుని గతంలో చేసిన తప్పులు తిరిగి చేయకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆలోచనగా ప్రచారం సాగుతుంది. అయితే దీనిపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది.
జగన్ ను తట్టుకోవాలంటే…?
ఈ నేపథ్యంలో ఈ ఫార్ములా జగన్ సంక్షేమ సునామిని తట్టుకుని నిలబడుతుందో లేదో చూడాలి. అయితే నూటికి నూరు శాతం అందరికి న్యాయం చేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. సొంత పార్టీలో అసంతృప్తులు , వెన్నుపోట్లు లేకుండా చూసుకోవడం రాజకీయాల్లో కష్టమే. జగన్ ఎంతటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా 51 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చినా దాని ప్రభావం దీర్ఘకాలం కొనసాగడం కొనసాగించడం కష్టమే అన్నది విపక్షాల అంచనా. చూడాలి భవిష్యత్తు రాజకీయాల్లో ఏమి జరగనుందో.