తిరుపతి సీన్ లో ఈ ముగ్గురూ కనిపించరా…?
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక హడావుడి మొదలైంది. నిజానికి కొన్ని నెలల క్రితం వరకూ చూస్తే తిరుపతిలో బస్తీమే సవాల్ అన్నట్లుగా పొలిటికల్ హీట్ సాగింది. [more]
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక హడావుడి మొదలైంది. నిజానికి కొన్ని నెలల క్రితం వరకూ చూస్తే తిరుపతిలో బస్తీమే సవాల్ అన్నట్లుగా పొలిటికల్ హీట్ సాగింది. [more]
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక హడావుడి మొదలైంది. నిజానికి కొన్ని నెలల క్రితం వరకూ చూస్తే తిరుపతిలో బస్తీమే సవాల్ అన్నట్లుగా పొలిటికల్ హీట్ సాగింది. కానీ దానికి ముందే లోకల్ బాడీ ఎన్నికలు జరగడంతో గ్రౌండ్ లెవెల్ లో ఎవరి బలం ఏంటి అన్నది కూడా తెలియడంతో తిరుపతి ఉప ఎన్నిక రిజల్ట్ మీద పెద్దగా ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది. పేరుకు మాత్రమే ఎన్నికల ప్రచారం సాగుతోంది. పెద్దగా సవాళ్ళూ లేవు, ప్రతి సవాళ్ళూ లేవు. అయితే ఇదే సీన్ చివరి వరకూ ఉంటుందా అంటే ఏమో అన్న మాట కూడా ఉంది.
జగన్ అలా….
ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ జనాలకు కనిపించడమే తగ్గించేశారు. ఆయన పార్టీ గుర్తు మీద జరిగిన మునిసిపల్ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. కనీసం మెగాసిటీ విశాఖలోనైనా ఒక్క మీటింగ్ పెట్టలేదు. అయినా మునిసిపాలిటీలలో వైసీపీకి ఏకపక్ష విజయం నమోదు అయింది. తిరుపతిలో కధ చూసినా అదే సీన్ రిపీట్ అవుతుంది అంటున్నారు. మరి ఈ టైమ్ లో జగన్ తిరుపతి ఎన్నికల ప్రచారానికి వస్తారా అన్నదే ఇక్కడ చర్చ. జగన్ రానూ వచ్చు, రాకపోనూ పోవచ్చు అని పార్టీలో వినవస్తున్న మాట.
సౌండే లేదుగా …?
మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు ఫుల్ సైలెంట్ అయిపోయారు. తిరుపతి బై పోల్ బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించి ఆయన డైరెక్షన్ కే పరిమితం అయ్యారు. టీడీపీ ప్రచారం కూడా నెమ్మదిగా సాగుతోంది. తాము పోటీ చేయాలి కాబట్టి చేస్తున్నామని అన్నట్లుగానే తమ్ముళ్ళు జనంలో కనిపిస్తున్నారు. ఇక ఇప్పటిదాకా వైసీపీ ని టార్గెట్ చేసే సరైన అస్త్రం కానీ జనాల్లో హాట్ టాపిక్ లాంటి అంశం కానీ ఏదీ విపక్షాలకు లేదు. దాంతో చప్పగానే ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు తిరుపతి ప్రచారానికి వస్తారా అంటే తమ్ముళ్ళ నుంచి కరెక్ట్ గా సమాధానం రావడంలేదు.
డౌటే మరి….
ఇక బీజేపీ జనసేన కూటమికి అసలైన అట్రాక్షన్ పవన్ కళ్యాణ్. ఆయన వస్తే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. బీజేపీ ఖాతాలో కూడా కొన్ని ఓట్లు పడతాయి. కానీ ఇప్పటిదాకా బీజేపీ తమ పార్టీ నేతలతోనే కధ నడుపుతోంది. ఏపీలో బీజేపీ సీన్ చూసి జాతీయ నాయకులు ఎవరైనా వస్తారా అన్నది కూడా డౌటే అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ పోకడలతో ఇప్పటికే హర్ట్ అయి ఉన్నారని కూడా ప్రచారంలో ఉంది. సో ఆయన బీజేపీ మద్దతుగా జనంలోకి వచ్చే విషయం సందేహమే అంటున్నారు. మొత్తానికి చూస్తే తిరుపతి ఉప ఎన్నికల్లో అగ్ర నేతలు ముగ్గురూ కనిపిస్తారా అన్నది చూడాల్సిందే మరి.