జగన్ 'పథకాల'కు పవన్ 'ఓటు '!
ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన బద్ధ విరోధి పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నారా?
ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన బద్ధ విరోధి పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నారా? అంటే అవుననే జవాబు రాక తప్పదు.''జగన్ ఓడితే పథకాలేం ఆగిపోవు.మరిన్ని అదనంగా అమలు చేస్తాం'' అని జనసేనాని వ్యాఖ్యల అంతరార్ధం ఏమిటి?జగన్ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని,ప్రజలకు ఆ పథకాల వలన మేలు జరుగుతోందని పవన్,చంద్రబాబు నిర్ధారణకు వస్తున్నట్లే కదా! ఇందులో మొహమాటం ఏమున్నది?ప్రభుత్వం మళ్ళీ రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోతాయని వైసీపీ నాయకత్వం ప్రచారం చేయడం సహజం.సంక్షేమ కార్యక్రమాలను కవచకుండలాలుగా జగన్ మలచుకున్నారన్న సంగతి ఆలస్యంగా అయినా టీడీపీ,జనసేన గుర్తిస్తున్నవి. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టలేక టిడిపి,జనసేన సతమతమవుతున్నవి.''ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలవకపోతే పథకాలు ఆగిపోతాయేమో, సంక్షేమం నిలిచిపోతుందేమో అనుకోవద్దు.ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు ఉంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలను అమలు చేస్తాం'' అని పవన్ కళ్యాణ్ సంక్షేమ లబ్దిదారులకు హామీ ఇచ్చారు.