గాజువాక చుట్టూ రంజైన రాజకీయం ?
విశాఖ పారిశ్రామిక రాజధాని అంటారు. దానికి కారణం సమీపంలో ఉన్న గాజువాకనే. పరిశ్రమలు అన్నీ అక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. గాజువాకలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఎన్నో [more]
విశాఖ పారిశ్రామిక రాజధాని అంటారు. దానికి కారణం సమీపంలో ఉన్న గాజువాకనే. పరిశ్రమలు అన్నీ అక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. గాజువాకలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఎన్నో [more]
విశాఖ పారిశ్రామిక రాజధాని అంటారు. దానికి కారణం సమీపంలో ఉన్న గాజువాకనే. పరిశ్రమలు అన్నీ అక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. గాజువాకలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి.అలాగే ప్రైవేటు కర్మాగారాలు ఉండడంతో ఇక్కడ వాతావరణం డిఫరెంట్ గా ఉంటుంది. మాస్ ఏరియాగా చెప్పుకోవాలి. ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎక్కువ. కాపులు జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంటే ఆ తరువాత యాదవులు ఎక్కువ, ఇక రెడ్లు కూడా పొలిటికల్ గా డామినేటింగ్ రోల్ ప్లే చేస్తారు. మత్య్సకారులు గంగవరం పోర్టు సమీప గ్రామాల్లో ఉంటూ ఎన్నికలను కీలక మలుపు తిప్పుతూంటారు. మొత్తానికి గాజువాక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో హాట్ టాపీ అయింది, దానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయడం.
మళ్లీ చూపు ….
ఇపుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట ఏంటి అంటే పవన్ కళ్యాణ్ చూపు మళ్లీ గాజువాక మీద పడింది అని. సినిమాల్లో ఒక మూవీ పోయినా పవన్ కల్యాణ్ బాధపడడు అని అంటారు. తన సినిమా కలెక్షన్ల మీద కూడా ఆయనకు ఆసక్తి లేదు అని చెబుతారు. కానీ రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ కసి మీదనే ఉంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయన తాను గాజువాక నుంచి ఎందుకు ఓడాను అని తీవ్రంగా మధనపడుతున్నారని అప్పట్లోనే టాక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ భీమవరం టఫ్ అవుతుందని అనుకున్నారుట. గాజువాక నల్లేరు మీద బండి అని అందుకే పెద్దగా ఇటు వైపు దృష్టి పెట్టలేదని అంటారు. ఓడినా గాజువాక తనదేనని పవన్ చెప్పాలనుకుంటున్నారు. అందుకే ఇపుడు ఏడాదిన్నర కాలం తరువాత పవన్ చూపు గాజువాక మీద పడిందని అంటున్నారు.
పోటీకి రెడీనా….?
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పరాజితుడు. విజయం కోసం పరితపిస్తున్న వాడు. అందువల్ల పోయిన చోటనే వెతుక్కోవాలనుకుంటున్నాడుట. దాంతో ఆయన విశాఖ వస్తే కచ్చితంగా గాజువాకలోనే తన టూర్లు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. గాజువాక నుంచి పవన్ మళ్లీ పోటీచేస్తారని జన సైనికులు గట్టిగా నమ్ముతున్నారు. పవన్ ఈసారి పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తాడని కూడా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ సీటు గా గాజువాకనే పవన్ ఎంచుకుంటారని కూడా అంటున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలి బలంగా వీచడం, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి అప్పటికి రెండు మార్లు పోటీ చేసి ఓడిన సానుభూతి తోడు అవడం, జనసేన చేసిన కొన్ని తప్పుల కారణంగా పవన్ ఓడారని నివేదికలు ఉన్నాయట. అందుకే ఈసారి గాజువాక తమకు గ్యారంటీ సీటు అంటున్నారు.
ఆయనకే పదవి…
ఈ సంగతిని గ్రహించిన వైసీపీ కూడా పవన్ని అడ్డుకోవడానికి తమదైన శైలిలో భారీ స్కెచ్ వేస్తోంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ పోటీ చేసినా కూడా తిప్పల నాగిరెడ్డే తమ అభ్యర్ధి అని వైసీపీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవ, పడిన కష్టమే మళ్లీ విజయం అందిస్తుందని చెబుతున్నారు. జగన్ కూడా నాగిరెడ్డికి ఏపీలో అతి ముఖ్యమైన నామినేటెడ్ పదవిని ఇచ్చేందుకు రెడీగా ఉన్నారుట. ఈ పదవితో రానున్న రోజుల్లో నాగిరెడ్డి గాజువాకలో తన హవా మరింతగా చాటుకుంటారని చెబుతున్నారు. పవన్ని ఢీ కొట్టి తమ రియల్ హీరోనే మళ్ళీ గెలుస్తాడని అందుకే వైసీపీ ధీమా పడుతోంది. ఇక విశాఖను పాలనారాజధానిగా చేయదానికి వైసీపీ సిధ్ధపడుతోంది. అందువల్ల ఆ ప్రభావంతో అన్ని సీట్లూ తమకే దక్కుతాయని ఆశపడుతోంది. మరి క్యాపిటల్ సిటీ కాబట్టే పవన్ కూడా గాజువాక వైపు చూస్తున్నారు అని జనసైనికులు చెబుతున్నారు. మొత్తానికి మరో మారు గాజువాక హాట్ టాపిక్ అయ్యేలా ఉంది.