ఆ సీటులో పవన్ పార్టీ ప్రభంజనమా..!
విశాఖపట్నం పట్టణంలోని గాజువాక నియోజకవర్గ రాజకీయం ఈసారి రసకందాయకంగా సాగనుంది. ఇక్కడ నుంచి వైసీపీ,టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు, బీజేపీ ఇలా ఐదు పార్టీల నేతలు పోటీ చేసేందుకు [more]
విశాఖపట్నం పట్టణంలోని గాజువాక నియోజకవర్గ రాజకీయం ఈసారి రసకందాయకంగా సాగనుంది. ఇక్కడ నుంచి వైసీపీ,టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు, బీజేపీ ఇలా ఐదు పార్టీల నేతలు పోటీ చేసేందుకు [more]
విశాఖపట్నం పట్టణంలోని గాజువాక నియోజకవర్గ రాజకీయం ఈసారి రసకందాయకంగా సాగనుంది. ఇక్కడ నుంచి వైసీపీ,టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు, బీజేపీ ఇలా ఐదు పార్టీల నేతలు పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఎలాగూ కాంగ్రెస్ ఎవరినో ఒకరిని అభ్యర్థిగా పెట్టాల్సి న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పార్టీ కూడా రేసులో నిలబడనుంది. అయితే రేసులో ఎంతమంది అభ్యర్థులు ఉన్నా.. పోటీ మాత్రం జనసేన, వైసీపీ, సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావు మధ్యే ఉండనుంది. ఈ నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. మొత్తంగా బీసీ ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అదే టైంలో కాపులతో పాటు ఏపీలో ఇతర జిల్లాల నుంచి అక్కడకు వచ్చి సెటిల్ అయిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత
ఇక టీడీపీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుపై కాస్తంత వ్యతిరేకత ఉంది. నియోజకవర్గంలో ఆయన తమ్ముడు శంకర్రావు పెత్తనం అధికం అవడమే ఇందుకు కారణమట. ఇదే విషయపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆయన ఇన్వాల్వ్మెంట్తో పార్టీ శ్రేణులకు ఇబ్బందికర వాతావరణం ఉందని వాళ్లు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే పార్టీ దక్కుతుందనడంలో సందేహం లేనప్పటికి పార్టీ శ్రేణులను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బంది తప్పదనే వాయిస్ వినబడుతోంది. ఇక వైసీపీ విషయానికి వస్తే తిప్పల నాగిరెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఈయన 2009, 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఆయనకు ప్రజలతో ప్రత్యక్షంగా సత్సంబంధాలున్నాయి. ఈ ప్రాంతంపై మంచి పట్టు ఉన్న నేతగా చెప్పుకోవచ్చు. రెండుసార్లు ఓడించిన ప్రజలు ఈసారి తనకు గెలుపు కట్టబెడతారనే ధీమాతో ఆయన ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన తిప్పల గురుమూర్తి కూడా ఈ స్థానం నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు.
జనసేన ప్రభావం స్పష్టం…
ఇక జనసేన నుంచి చింతలపూడి వెంకటరామయ్య పోటీకి సిద్ధమవుతున్నారు. ఈయన 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో పనిచేసిన అనుభవంతో ఈసారి జనసేన నుంచి బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇదే పార్టీ టికెట్ పొత్తులో భాగంగా తమకు కేటాయించేలా చూసుకుంటామని, అందుకు పవన్‌కల్యాణ్ నుంచి హామీ ఉందని పలువురు కమ్యూనిస్ట్ నేతలు పేర్కొంటుండటం జనసేన నేతలను కలవరపెడుతోంది. నగరంలో జనసేన బలంగా ప్రభావం చూపే నియోజకవర్గాల్లో గాజువాకే తొలిస్థానంలో ఉందన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి విశాఖ మాజీ మేయర్ పులుసు జనర్దాన్రావు బరిలో దిగుతానని ప్రకటిస్తున్నారు. ఆ పార్టీకి ఇక్కడ పెద్దగా ఓటు బ్యాంక్ అయితే లేదు…పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. గాజువాక త్రిముఖ పోరే ఖాయమని పేర్కొంటున్నారు.