రమ్మన్నా … రాను పొమ్మన్నారే …?
ఏపీ లో ఇసుక సమస్యపై తమ పార్టీ చేపడుతున్న ఉద్యమం లో చేయి కలపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపి కి ఆఫర్ ఇచ్చారు. అయితే [more]
ఏపీ లో ఇసుక సమస్యపై తమ పార్టీ చేపడుతున్న ఉద్యమం లో చేయి కలపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపి కి ఆఫర్ ఇచ్చారు. అయితే [more]
ఏపీ లో ఇసుక సమస్యపై తమ పార్టీ చేపడుతున్న ఉద్యమం లో చేయి కలపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపి కి ఆఫర్ ఇచ్చారు. అయితే జనసేన కార్యక్రమాన్ని అభినందిస్తూనే విశాఖలో జనసేన చేపట్టబోయే నవంబర్ 3న మార్చ్ కి తాము దూరమని తేల్చేసింది కమలం. ఇదే ఆఫర్ టిడిపి అధినేత చంద్రబాబు కి ఇస్తే ఆయన జై జనసేన అనేశారు. మరి విపక్షాలన్నిటిని ఒకే తాటిపైకి తెచ్చి అధికార వైసిపి కి చుక్కలు చూపించాలని ఇసుక సాక్షిగా అనుకున్న పవన్ కల్యాణ్ ఆశలను కాషాయ పార్టీ నో చెప్పడానికి రీజన్స్ చాలానే ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ లో అన్ని పార్టీలకు దూరంగా ఉండాలనే బిజెపి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఒంటరిగానే ఎదగాలి …
పార్టీల హిడెన్ ఎజెండాల వలలో పడకుండా సొంతంగా ఎదగాలన్న ఆలోచనతోనే కమలం ఏపీ లో అడుగులు వేస్తుంది. కిందిస్థాయి నుంచి పార్టీ నిర్మాణం బూత్ స్థాయిలో కార్యకర్తల నియామకం వంటి పనుల్లో ప్రస్తుతం బిజీగా వుంది. ప్రజల్లోకి వెళ్లేందుకు ఏ కార్యక్రమం అయినా తమ పార్టీకి క్రెడిట్ దక్కేలా వుండాలని కోరుకుంటుంది కాషాయ పార్టీ. ఎపి లో ఎవరి వెనుక వెళ్లినా తోక పార్టీలాగే ఉండిపోతామని భావించే బిజెపి వ్యూహకర్తలు మొహమాటం లేకుండా ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.
ఎవరికి వారే…..
అందుకే పవన్ కల్యాణ్ నవంబర్ 3 న వైజాగ్ లో ఇసుక ఉద్యమం చేపడితే నవంబర్ 4 న బిజెపి తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. పవన్ కల్యాణ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వెంటనే టిడిపి అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా ఆందోళనలు ముందే చేపట్టి తమ మైలేజ్ తాము చూసుకుంది. కామ్రేడ్ లు ఇసుక ఉద్యమాన్ని మొన్నటి వరకు ఒంటరిగానే చేపట్టారు. సో ఎవరికి వారే యమునా తీరే లానే ఇసుక ఉద్యమం చివరికి మిగిలేలా కనిపిస్తుంది.