మళ్లీ భీమవరం, గాజువాక గొర్తొచ్చాయా ?
పవన్ కళ్యాణ్‌కు మళ్లీ ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు గుర్తొచ్చినట్లున్నాయి. సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ [more]
పవన్ కళ్యాణ్‌కు మళ్లీ ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు గుర్తొచ్చినట్లున్నాయి. సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ [more]
పవన్ కళ్యాణ్‌కు మళ్లీ ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు గుర్తొచ్చినట్లున్నాయి. సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత మధ్యలో భీమవరంలో ఒక్కసారి మాత్రమే పర్యటించి… ఇప్పుడు షూటింగులలో ఫుల్ బిజీ అయిపోయాడు. పవన్ చేతిలో ప్రస్తుతం ఐదారు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఏపీలో ఈ నెల 10న కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. భీమవరంలో మునిసిపల్ ఎన్నికలు జరగకపోయినా జీవీఎంసీ పరిధిలో ఉన్న గాజువాకలో ఎన్నికలు ఉన్నాయి. దీంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో ఎన్నికల ప్రచారం చేయాలని జనసేన నాయకులు ఆయనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా స్థానిక కేడర్ అక్కడ పార్టీ నాయకులపై తీవ్రమైన ఒత్తిడి చేయడంతో వారంతా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలిసింది.
ఎన్నికలు ముగిసిన తర్వాతే…?
పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు షూటింగ్‌ల పరంగా క్షణం తీరిక లేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఆయన మునిసిపల్ ఎన్నికలు ముగిశాఖ రెండు, మూడు రోజులు టైం చూసుకుని తన రెండు నియోజకవర్గాల పర్యటనకు రెడీ అవుతున్నారట. స్థానికంగా పార్టీ కేడర్‌లో ఈ ఉత్సాహం రావడానికి.. పవన్ కళ్యాణ్‌ను ప్రచారానికి ఆహ్వానించడానికి కారణాలు కూడా ఉన్నాయి. పవన్ సొంత జిల్లా అయిన భీమవరంతో పాటు చుట్టు పక్కల నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాల్లో జనసేన సంచలన విజయాలు సాధించింది. అలాగే జనసేన గెలిచిన రాజోలుతో పాటు కోనసీమలో… అటు విశాఖ జిల్లాలో జనసేన పంచాయతీ ఎన్నికల్లో అంచనాలకు మించి సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలతో పాటు వార్డులు గెలిచింది.
క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు….
ఇదే ఉత్సాహం ఇప్పుడు స్థానికంగా పార్టీ కేడర్‌లో ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ తిరిగి ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తే కేడర్‌లో కొత్త జోష్ వస్తుందన్న ఆశలు ఉన్నాయి. అందుకే తాజా ఎన్నికల ప్రచారానికి పవన్ వస్తే ఈరెండు చోట్లా జనసేన మరింత పుంజుకుంటుందన్నదే వారి ఆశ. మున్సిపల్ ఎన్నికల్లో సినిమా షూటింగ్ ల కారణంగా పవన్ కల్యాణ్ ప్రచారానికి రాలేకపోయారు. ఈ ఎన్నికల తర్వాత మాత్రం గాజువాకలో పర్యటించి కార్యకర్తలను కలుసుకోవడంతో పాటు భీమవరంలో ఓ సభ కూడా నిర్వహించాలని జనసేన అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
భీమవరంలో సభ…..
ఇటీవల భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌కు, పవన్ కళ్యాణ్ కు మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగింది. అందుకే అక్కడ పవన్ ఓ సభ పెట్టి పార్టీ సత్తా చాటాలని జనసేన నాయకులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాలకు దూరమై చాలా రోజులు అయ్యింది. ఇప్పటకీ అయినా పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో పర్యటిస్తే కేడర్‌లో ఉత్సాహం రావడంతో పాటు సాధారణ జనాలు సైతం పవన్ కళ్యాణ్‌ను గుర్తు పెట్టుకుంటారు.