Janasena : వారు చేరతానంటే జనసేనాని నో చెప్పారా?
నిన్నగాక మొన్ననే చెప్పారు. తనతో ఇరవై ఏళ్ల పాటు ప్రయాణం చేయగలిగిన ఓపిక ఉన్న వారే పార్టీలో చేరాలని లేకుంటే లేదని. కానీ అంతలోనే మనసు మార్చుకున్నారనిపిస్తుంది. [more]
నిన్నగాక మొన్ననే చెప్పారు. తనతో ఇరవై ఏళ్ల పాటు ప్రయాణం చేయగలిగిన ఓపిక ఉన్న వారే పార్టీలో చేరాలని లేకుంటే లేదని. కానీ అంతలోనే మనసు మార్చుకున్నారనిపిస్తుంది. [more]
నిన్నగాక మొన్ననే చెప్పారు. తనతో ఇరవై ఏళ్ల పాటు ప్రయాణం చేయగలిగిన ఓపిక ఉన్న వారే పార్టీలో చేరాలని లేకుంటే లేదని. కానీ అంతలోనే మనసు మార్చుకున్నారనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ స్టేట్ మెంట్ ఇచ్చినా అది డైలాగుగానే అర్థం చేసుకోవలేమో. ఆ డైలాగ్ ఆ సినిమాకే పరిమితమవుతుంది. రాజకీయాల్లోనూ తన డైలాగులను ఆ సభల వరకే పవన్ కల్యాణ్ పరిమితం చేసేటట్లు ఉంది.
ఇరవై ఏళ్లు తన వెంట నడిచేవారే….
ఇటీవల రాజమండ్రికి వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. తనకు కార్యకర్తలే ముఖ్యమని నేతలు కాదని అన్నారు. జనంలో మార్పు రావాలని కోరుకున్నారు. కొందరు తన పార్టీలో చేరి వేరే పార్టీలోకి వెళుతున్నారని, అటువంటి వారు తమకు అవసరం లేదని చెప్పారు. ఇరవై ఏళ్ల పాటు అధికారంలో లేకపోయినా తన వెంట నడిచే వాళ్లే తనతో రావాలని ఆయన గట్టిగా చెప్పారు. అనవసరమైన నేతలను పార్టీలోకి తీసుకోనని కూడా పవన్ కల్యాణ్ విస్పష్టంగా చెప్పారు.
పొత్తు ఉంటుందన్న ప్రచారంతో….
అయితే జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో కొందరు నేతలు పవన్ కల్యాణ్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రతి ఎన్నికకూ పార్టీలు మారుస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ఒకరు, అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఒకరు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
వారు చేరతామన్నా…..?
వీరు చేరతానని పార్టీ సీనియర్ నేత వద్దకు రాయబారం పంపారు. అయితే పవన్ కల్యాణ్ వీరి చేరికకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. వారు చేరినా వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటారని, పార్టీ కి ఉపయోగపడరని, అధికారంలోకి రాలేకపోతే వెంటనే వారు పార్టీని వీడతారని, అటువంటి వారిని చేర్చుకోవడం అనవసరమని పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. తటస్థులుగా ఉండి ప్రజా సేవలో ఉంటూ వైద్యులు, రిటైర్డ్ ఇంజినీర్ల వంటి కొత్త వారిని లైమ్ లైట్ లోకి తీసుకురావాలని పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు సూచించినట్లు తెలిసింది.