పెద్దిరెడ్డిని జగన్ వాడుతున్నంతగా ఎవరూ వాడలేదే …?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే పొలిటికల్ క్యారక్టర్ కి ఇంత సీన్ ఉందని ఏపీ రాజకీయాల్లో ఎవరికీ తెలియదు. ఆయన వైఎస్సార్ జమానాలో మామూలు మంత్రిగా ఉండేవారు. నాడు [more]
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే పొలిటికల్ క్యారక్టర్ కి ఇంత సీన్ ఉందని ఏపీ రాజకీయాల్లో ఎవరికీ తెలియదు. ఆయన వైఎస్సార్ జమానాలో మామూలు మంత్రిగా ఉండేవారు. నాడు [more]
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే పొలిటికల్ క్యారక్టర్ కి ఇంత సీన్ ఉందని ఏపీ రాజకీయాల్లో ఎవరికీ తెలియదు. ఆయన వైఎస్సార్ జమానాలో మామూలు మంత్రిగా ఉండేవారు. నాడు క్యాబినెట్ మంత్రులు చాలా మంది హడావుడి చేసినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడా అసలు కనిపించేవారు కాదు. కానీ జగన్ ఏలుబడిలో మాత్రం పెద్దిరెడ్డి పేరు పెద్ద ఎత్తున మారుమోగుతోంది. జగన్ సైతం ఆయనకు వరసపెట్టి బిగ్ టాస్కులు ఇస్తూంటే వాటిని అలవోకగా ఛేదిస్తూ పెద్దిరెడ్డి టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ అయిపోయారు. ఒక దశలో ఏపీ సీఎం జగనా పెద్దిరెడ్డా అన్నట్లుగా కూడా చర్చకు వస్తోంది అంటే పెద్దిరెడ్డి దూకుడే వేరు అని చెప్పాల్సిందే.
బాబు సొంత ఇలాకాలో…?
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకు జగన్ కి అసలు పడదు, ఇద్దరూ ముఖాముఖాలు చూసుకోవడానికి కూడా అసలు ఇష్టపడరని చెబుతారు. మరి బాబు సొంత జిల్లాలో ఆయనని రాజకీయంగా అణగదొక్కాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరే జగన్ కళ్ల ముందు ఉంటోంది. పెద్దిరెడ్డిని ముందు పెట్టి జగన్ మొత్తం కధను నడిపిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం బాబు గుట్లూ పట్లూ అన్నీ తెలుసు కాబట్టి ఎక్కడికక్కడ టీడీపీకి బ్రేకులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో ఇంత స్ట్రాంగా అని ఎవరికైనా అనిపించకమానదు. పైగా వ్యూహాలు అంటే ఇప్పటిదాకా చంద్రబాబువే అని అంతా భావిస్తూ వచ్చారు. కానీ ఇపుడు పెద్దిరెడ్డిని చూసి కూడా షాక్ తినాల్సి వస్తోంది.
సింగిల్ హ్యాండ్ తో ..?
జగన్ సీఎం కావడానికి ఏపీ మొత్తం సహకరించింది. ఇక చిత్తూరులో అయితే ఒక్క చంద్రబాబు తప్ప మొత్తం అంతా వైసీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. దాని వెనక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని చెబుతారు. అదే విధంగా స్థానిక ఎన్నికలు జరిగితే చిత్తూరు జిల్లా క్లీన్ స్వీప్ చేశారు. అదే విధంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగితే ఆ వైపు న చంద్రబాబు, బీజేపీ సహా ఎంతో మంది యోధానుయోధులు ఉంటే అందరికీ సింగిల్ హ్యాండ్ తో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జవాబు చెప్పారు. జగన్ తిరుపతి టూర్ కి రాకుండానే కధ మొత్తం నడిపారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రేట్ అని అనకుండా ఎవరైనా ఉండగలరా..
ర్యాంకులన్నీ ఆయనకే…?
వైసీపీలో నంబర్ల గేమ్ నడవదు, ఎందుకంటే వన్ టూ టెన్ అన్నీ జగనే కాబట్టి. ఎవరిని దగ్గరగా తీసుకున్నా కూడా అది కొన్నాళ్ల ముచ్చటే. అదే జగన్ మార్క్ మంత్రాంగం. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం జగన్ ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి ఉంది. చంద్రబాబుని దెబ్బ తీయాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఆయుధం వాడక తప్పదు. దాంతో వైసీపీలో పెద్దిరెడ్డి ప్రాధాన్యత అంతకంతకు పెరిగిపోతోంది. మరి తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు వెలువడి జగన్ ఆశించిన మెజారిటీని కనుక తీసుకువస్తే వైసీపీలో పెద్దిరెడ్డి ఇంకా దూకుడు పెంచడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టాలెంట్ ని ఏ ముఖ్యమంత్రీ వాడని విధంగా జగన్ టోటల్ గా వాడేస్తున్నారు అన్న టాక్ అయితే వైసీపీలో ఉంది.