Peddireddy : పెద్దిరెడ్డిని ఆ విధంగా కట్టడి చేస్తారా?
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నేత. అన్ని రకాలుగా ఆయన గత కొన్నేళ్లుగా పుంగనూరు నియోజకవర్గంలో సత్తా చూపుతున్నారు. అయితే ఈసారి పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలన్నది చంద్రబాబు [more]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నేత. అన్ని రకాలుగా ఆయన గత కొన్నేళ్లుగా పుంగనూరు నియోజకవర్గంలో సత్తా చూపుతున్నారు. అయితే ఈసారి పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలన్నది చంద్రబాబు [more]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నేత. అన్ని రకాలుగా ఆయన గత కొన్నేళ్లుగా పుంగనూరు నియోజకవర్గంలో సత్తా చూపుతున్నారు. అయితే ఈసారి పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఆయనను కట్టడి చేయగలిగితేనే మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బయటపడతారన్నది టీడీపీ అధినేత అభిప్రాయం. రానున్న కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మరింత మాటల దాడికి చంద్రబాబు దిగే అవకాశముంది.
మూడు సార్లు గెలిచి….
ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఇప్పటికే పుంగనూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించారు. 2009 నుంచి ఆయన ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంటూ తన సత్తాను చూపిస్తున్నారు. ఆయన కేవలం పుంగనూరు నియోజకవర్గం మాత్రమే కాకుండా మిగిలిన నియజకవర్గాలపై కూడా ప్రభావం చూపుతున్నారు. కుప్పం పై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టి పెట్టడంతో చంద్రబాబు విలవిలలాడుతున్నారు.
అక్కడికే పరిమితం…
అందుకే చంద్రబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కట్టడి చేసేందుకు చల్లా రామచంద్రారెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించారు. కానీ ఆయనను ఆపడం అంత సులువు కాదు. పెద్దిరెడ్డిపై మాటల దాడిని మరింత పెంచి ఆయనను నియోజకవర్గానికే పరిమితం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అధికారంలో ఉండటంతో ఆయనను మరే విధంగా కట్టడి చేయలేని పరిస్థితి చంద్రబాబుది. అవినీతి ఆరోపణలు కూడా పెద్దగా లేవు.
కుప్పం మున్సిపాలిటీపై….
కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ అంశంలోనైనా దొరికితే వదిలి పెట్టకుండా వెంబడించాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నట్లు కన్పిస్తుంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇక్కడ టీడీపీ గెలిస్తే పెద్దిరెడ్డి ఓటమి పాలయినట్లే. మానసికంగా దెబ్బ కొట్టినట్లవుతుంది. అందుకే చంద్రబాబు కుప్పం మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిత్యం రివ్యూలు చేస్తున్నారు.