టచ్ చేయకుండా క్యాష్ …?
కరోనా దెబ్బతో ఎటిఎం లకు వెళ్ళి నగదు తీయడానికి సైతం జనం భయపడుతున్నారు. అలాగని ప్రతి ఎటిఎం దగ్గర శానిటైజర్ లు లేక రక్షణ చర్యలు తీసుకోవడం [more]
కరోనా దెబ్బతో ఎటిఎం లకు వెళ్ళి నగదు తీయడానికి సైతం జనం భయపడుతున్నారు. అలాగని ప్రతి ఎటిఎం దగ్గర శానిటైజర్ లు లేక రక్షణ చర్యలు తీసుకోవడం [more]
కరోనా దెబ్బతో ఎటిఎం లకు వెళ్ళి నగదు తీయడానికి సైతం జనం భయపడుతున్నారు. అలాగని ప్రతి ఎటిఎం దగ్గర శానిటైజర్ లు లేక రక్షణ చర్యలు తీసుకోవడం అంత సులువు అయితే కాదు. దీనికి సిబ్బంది అవసరం ఉంటుంది. అది బ్యాంక్ లపై భారం కానుంది. గతంలోనే సిబ్బంది లేని ఎటిఎం లను చాలా బ్యాంక్ లు ఏర్పాటు చేసుకుని నిర్వహణ ఖర్చును జీరో చేసుకునే పని లో పడ్డాయి. వైరస్ ప్రభావంతో ఇప్పుడు దేశంలో ఉన్న 70 వేల ఎటిఎం లు ఇకపై కొత్త రూపు సంతరించుకోనున్నాయి.
క్యూఆర్ కోడ్ తోనే …
పెట్రోల్ బంక్ లు, వ్యాపార సంస్థల్లో క్యుఆర్ కోడ్ లతో యుపిఐ పిన్ విధానంలో నగదు బదిలీ సాగించడం పెద్ద ఎత్తునే మొదలు పెట్టాయి. తమ సెల్ ఫోన్ ద్వారా ఈ పనిని వినియోగదారులు సులువుగా సాగించడం నోట్ల రద్దు నుంచి మొదలైంది కూడా. ఇదే పద్ధతిలో ఎటిఎం యంత్రాల వద్ద క్యూ ఆర్ కోడ్ ద్వారా నగదు వచ్చేలా సాఫ్ట్ వేర్ సిద్ధం అవుతుంది. ఈ విధానంలో వినియోగదారులు ఎటిఎం మిషన్ ముట్టుకోకుండానే తమకు అవసరమైన నగదును తీసుకునే వీలుంటుంది. ఫలితంగా వారు మిషన్ దగ్గర వుండే ప్యానెల్ బోర్డు ను టచ్ చేయాలిసిన పని ఉండదు. త్వరలోనే ఈ విధానం అన్ని మిషన్స్ కి ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం అవుతుంది. దీనితో వైరస్ వ్యాప్తి నిరోధానికి కీలకమైన బ్యాంకింగ్ రంగం మరో ముందడుగు వేసినట్లే.