Andhra : ఎవరికీ ఆ హక్కులేదా? ఎవరినీ నమ్మరా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. అయితే ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు ప్రజల వద్దకు వెళ్లి వివరణ ఇచ్చుకునే నైతికత లేదన్నది [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. అయితే ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు ప్రజల వద్దకు వెళ్లి వివరణ ఇచ్చుకునే నైతికత లేదన్నది [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. అయితే ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు ప్రజల వద్దకు వెళ్లి వివరణ ఇచ్చుకునే నైతికత లేదన్నది వాస్తవం. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలూ యూటర్న్ తీసుకున్నాయి. మరోసారి ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకువద్దామనుకున్నా ప్రజలు ఈ మూడు పార్టీలను నమ్మరు. కాంగ్రెస్ ను నమ్మినా దానివల్ల ప్రయోజనం లేదు.
ప్రత్యేక హోదా విషయంలో….
ఏపీకి ప్రత్యేక హోదాను మూడు ప్రధాన పార్టీలు తాకట్టు పెట్టేశాయన్న విమర్శలు ఉన్నాయి. ఇందులో బీజేపీ ప్రధాన దోషి. బీజేపీ చెప్పినట్లు నడుచుకున్న వైసీపీ, జనసేన, టీడీపీలు ఇప్పుడు ప్రజల దృష్టిలో దోషులనే చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం ఎవరూ చిత్తశుద్ధిగా ప్రయత్నించలేదు. రాష్ట్ర విభజన హామీల్లో ఉన్న ప్రధాన అంశాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదాను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
అధికారంలోకి రాగానే….
అధికార పార్టీ వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ చెప్పేశారు. 22 మంది ఎంపీలున్నప్పటికీ సొంతంగ బలంగా ఉన్న బీజేపీని ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. పైగా ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో నామమాత్రంగా ఆందోళన చేయడం తప్ప చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. పైగా నాడు ప్రత్యేక హోదా కోసం బీజేపీ పై అవిశ్వాసం పెట్టిన పార్టీ ఇది. కానీ అధికారంలోకి రాగానే హోదా విషయాన్ని జగన్ తెలివిగా అటకెక్కించగలిగారు.
తాకట్టు పెట్టిందే…..
ఇక చంద్రబాబు హోదా రాకపోవడానికి మూల కారకుడు. నాడు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ఇప్పుడు హోదా అని గొంతెత్తినా జనం పట్టించుకోని పరిస్థితి. పైగా హోదా ఇవ్వనన్న బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాచిపోయిన లడ్డూలంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోయి అదే పార్టీతో కలసి నడుస్తున్నారు. సో ఏపీలో ఉన్న నాలుగు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదాపై మళ్లీ నినదించే అవకాశం లేదు. జనం కూడా నమ్మరు. వీళ్లు కొత్త అంశాన్ని ఎంచుకోవాల్సిందే.