పాజిటివ్ లు పారిపోతున్నారు… ఎవరికి అంటిస్తారో?
టెస్ట్ లు చేయించుకుంటున్న వారు కరోనా పాజిటివ్ అని తేలితే ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. అంతే కాదు బిచాణా ఎత్తేస్తున్నారు. ఇది చిత్తూరు జిల్లాల్లో [more]
టెస్ట్ లు చేయించుకుంటున్న వారు కరోనా పాజిటివ్ అని తేలితే ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. అంతే కాదు బిచాణా ఎత్తేస్తున్నారు. ఇది చిత్తూరు జిల్లాల్లో [more]
టెస్ట్ లు చేయించుకుంటున్న వారు కరోనా పాజిటివ్ అని తేలితే ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. అంతే కాదు బిచాణా ఎత్తేస్తున్నారు. ఇది చిత్తూరు జిల్లాల్లో ముఖ్యంగా దైవక్షేత్రం తిరుపతిలో జరుగుతున్న బాగోతం. ఇలా రోజుకు 20 మంది చొప్పున ఇప్పటివరకు 250 మంది వరకు మాయం అయిన నేపధ్యం అధికార యంత్రాంగం లో ప్రజల్లో తీవ్ర ఆందోళన కు కారణం అయ్యింది. దాంతో బాధ్యత లేని వారిని కట్టడి చేసేందుకు మార్గాలను ప్రభుత్వ యంత్రాంగం అన్వేషిస్తుంది.
తప్పుడు నెంబర్ లు, చిరునామాలు …
కరోనా టెస్ట్ కోసం సంబంధిత వ్యక్తి ఫోన్ నెంబర్, చిరునామా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన వారి సెల్ నెంబర్ కి పరీక్షల్లో వచ్చిన రిపోర్ట్ నేరుగా మెసేజ్ గా ఇస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి వయసు 60 దాటి ఇతర వ్యాధులు ఏమైనా ఉంటె ఆసుపత్రుల్లో చేరాలిసి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేని పక్షంలో ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉండాలి. కానీ ఇప్పుడు ఫోన్ నెంబర్ లు తప్పు గా ఇవ్వడం, చిరునామా కూడా తప్పు గా ఇవ్వడంతో పాజిటివ్ వచ్చిన వారు ఏమై పోయారన్నది అంతుపట్టకుండా ఉంది. వీరు తమ లక్షణాలను బట్టి సాధారణ మందులు వాడుతూ ప్రజల్లో తిరిగితే మరింతమందికి వైరస్ చేరవేసే ప్రమాదం ఉంది.
కట్టడికి ఓటిపి …
కొందరు పాజిటివ్ లు మిస్ అవుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా యంత్రాంగం పక్కా విధానం రూపొందించింది. మొబైల్ నెంబర్ సరైందా లేదా, చిరునామా సరిగ్గా ఉందా లేదా ఓటీపీ నెంబర్ తో నిర్ధారించుకున్న తరువాతే వారికి కరోనా టెస్ట్ చేయాలని నిర్ణయించింది. మరో పక్క కనిపించకుండా పోయిన పాజిటివ్ నిర్ధారణ అయినవారికోసం పోలీసులతో అన్వేషణ మొదలు పెట్టింది. టెస్ట్ లు చేయించుకున్నవారు బాధ్యతగా ఉంటే సమాజానికి మంచిదని అందుకు ప్రతిఒక్కరు సహకరించాలని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిని అంతా ఆచరించాలి.