రాజన్న దొరకు రాజయోగమేనా.. ?
వైఎస్సార్ ప్రియ శిష్యుడు, వైసీపీకి అత్యంత వీర విధేయుడు అయిన పీడిక రాజన్న దొరకు మంత్రి యోగం పడుతుందా అంటే నిజమే అంటున్నాయి వైసీపీ వర్గాలు. మరి [more]
వైఎస్సార్ ప్రియ శిష్యుడు, వైసీపీకి అత్యంత వీర విధేయుడు అయిన పీడిక రాజన్న దొరకు మంత్రి యోగం పడుతుందా అంటే నిజమే అంటున్నాయి వైసీపీ వర్గాలు. మరి [more]
వైఎస్సార్ ప్రియ శిష్యుడు, వైసీపీకి అత్యంత వీర విధేయుడు అయిన పీడిక రాజన్న దొరకు మంత్రి యోగం పడుతుందా అంటే నిజమే అంటున్నాయి వైసీపీ వర్గాలు. మరి కొద్ది నెలల్లో జరగబోయే విస్తరణలో గిరిజన కోటా నుంచి రాజన్న దొరకు మంత్రి పదవి దక్కడం ఖాయమనే చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిని తప్పించి దొరకు పట్టం కడతారు అన్నదే ఇపుడు చర్చ. ఆయన ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సాలూరు నుంచి గెలిచారు. అంతే కాదు ఏనాడూ పార్టీ లైన్ దాటలేదు. పైగా ప్రజలకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు.
జగన్ ఓటు….
డిసెంబర్ లో జరిగే విస్తరణలో ఎవరికి పదవులు వస్తాయి అన్న దాని మీద వైసీపీలో హాట్ హాట్ గా డిస్కషన్ సాగుతోంది. విజయనగరం జిల్లాలో చూసుకుంటే సీనియర్ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఇక రెండవ పదవి పుష్ప శ్రీవాణిని నాడు వరించింది. ఈసారి బొత్సను అలాగే కంటిన్యూ చేసి శ్రీవాణిని మాత్రం మారుస్తారు అంటున్నారు. జగన్ ఈ విషయంలో రాజన్న దొరకే ఓటు వేస్తున్నారు అంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ కి మద్దతు ఇచ్చి తన అంకితభావాన్ని నిరూపించుకున్నారు అన్నదే క్రెడిటేరియాగా చూస్తున్నారుట.
వివాదాల్లో ఆమె….?
నిజానికి పుష్ప శ్రీవాణికి రాజకీయంగా ఉన్నతిని జగన్ కల్పించినా ఆమె దాన్ని అందిపుచ్చుకోలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. ఆమె కురుపాం లోని తన ఇంటికి దాటి బయటకు రాని పరిస్థితే ఉంది. కీలకమైన గిరిజన సంక్షేమ శాఖతో పాటు గిరిజన సలహా మండలి చైర్ పర్సన్ గా కూడా జగన్ చేశారు. కానీ ఆమె గిరిజనుల అభివృద్ధి విషయంలో తనకంటూ ప్రత్యేక శ్రద్ధను తీసుకుని బలమైన ముద్రను వేయలేకపోయారు అన్నదే అధినాయకత్వం ఆలోచనగా ఉందిట. అదే విధంగా ఆమె ఎస్టీ కాదు అంటూ వివాదాలు కోర్టులలో నడుస్తున్నాయి. దీనికి తోడు జిల్లాలో వైసీపీ పటిష్టతకు కూదా ఆమె చేసిన కృషి లేదని నివేదికలు ఉన్నాయి. దీంతో ఆమెని తొలగిస్తారు అనే అంటున్నారు.
ఇబ్బంది లేకుండానే…?
ఇక విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణదే పై చేయి. ఆయనకు అనుకూలంగా నే రాజకీయాన్ని మలచుకుంటారు. రెండవ మంత్రి పదవి కోలగట్ల వీరభద్రస్వామికి దక్కకుండా బొత్స ఇప్పటికే చక్రం తిప్పుతున్నారు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ఆ పదవి వెళ్తుంది అని అంటున్నారు. దాంతో రాజన్న దొరకు మంత్రి పదవి ఇచ్చినా బొత్స దూకుడుకు ఏ మాత్రం ఆటంకం ఉండదు. దాంతో జగన్ ఆలోచనలకు బొత్స కూడా సై అంటున్నారుట. ఈ పరిణామాలతో రాజన్న దొర అనుచరులలో ఆనందం వెల్లి విరుస్తోంది. నిజాయతీపరుడైన తమ నాయకుడిని ఇప్పటికైనా గుర్తింపు దక్కితే అదే పదివేలు అంటున్నారుట.