పిల్లి సీన్ రివర్స్ అయిందా? రీజన్ అదేనా?
మాజీ మంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి కి అత్యంత ఇష్టుడిగా అదే [more]
మాజీ మంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి కి అత్యంత ఇష్టుడిగా అదే [more]
మాజీ మంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి కి అత్యంత ఇష్టుడిగా అదే స్థాయిలో ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి అమితంగా గౌరవించే అతికొద్ది వ్యక్తుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకరు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధిష్టానం అంటే తనకు వైఎస్సాఆర్ అని ప్రకటించి వైఎస్ జగన్ తో కష్టకాలంలో ప్రయాణించిన వారిలో బోస్ ముఖ్యులు. అలాగే తన రాజకీయ జీవితంలో బోస్ కి అవినీతి మరకలు లేవు. వైఎస్ ఇచ్చిన ఎలక్షన్ ఫండ్ ఎన్నికలు అయ్యాక ఇంత మిగిలిందని కొంత సొమ్మును లెక్కలతో అప్పగించిన నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక్కరే అంటారు. మధ్యలో ఎవరి ప్రేమేయం, అపాయింట్ మెంట్ లు లేకుండా నేరుగా ముఖ్యమంత్రి జగన్ తో చర్చించే చనువు బోస్ కె ఉందంటారు. తూర్పుగోదావరి జిల్లాల్లో నిన్న మొన్నటివరకు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాటే జగన్ దగ్గర వేదం. కానీ కొంతకాలంగా ఆ సీన్ రివర్స్ అయిందనే టాక్ వినబడుతుంది.
చెల్లుబోయినకు టాప్ ప్రయారిటీ …
వైఎస్ జగన్ 2019 లో రామచంద్రపురం లో దశాబ్దాలుగా అమలవుతున్న ఫార్ములా పూర్తిగా మార్చేశారు. పిల్లి సుభాష్ చంద్ర బోస్ ను అక్కడినుంచి తప్పించి మండపేట నియోజకవర్గానికి పంపించారు. అంతకుముందే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తోట త్రిమూర్తుల చేతిలో బోస్ ఓటమి చెందినా పార్టీ నుంచి ఎమ్యెల్సీ కోటా లో అగ్రస్థానం ఇచ్చి విశ్వసనీయత కలిగి విధేయులుగా ఉండేవారి పట్ల తానిచ్చే గౌరవం చెప్పక చెప్పేశారు జగన్. పార్టీ అధికారంలోకి వచ్చాకా క్యాబినెట్ బెర్త్ తో పాటు ఉపముఖ్యమంత్రి హోదా కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ కి ఇచ్చారు జగన్. 2019 ఎన్నికల్లో రామచంద్ర పురం నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్యెల్యేగా గెలుపొందారు. బోస్ ను మంత్రి పదవికి రాజీనామా చేయించి ఆయన్ను రాజ్యసభకు పంపారు వైఎస్ జగన్. ఆయన చేసిన ఖాళీలో చెల్లుబోయిన వేణు కు మంత్రి పదవి ఇచ్చి ఆ సామాజికవర్గం పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించారు జగన్. ఆ తరువాత వేణు స్పీడ్ అందుకోగా బోస్ అన్నిటా స్లో అయ్యారు. క్యాబినెట్ లో కూడా వేణు కు అత్యంత ప్రాధాన్యత ను వైసిపి అధినేత ఇస్తూ వస్తున్నారు. ఇది కూడా బోస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేకుండా చేసిందని తెలుస్తుంది.
తోటకు ఎమ్యెల్సీ తో …
తూర్పుగోదావరి రాజకీయాలకు వచ్చేటప్పటికి ప్రధానమైన సామాజికవర్గాలు ఎస్సి, కాపు, బిసి. వీటి నడుమ సమతౌల్యం రాజకీయంగా పాటించడం ఈ జిల్లావరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ సంప్రదాయం పాటిస్తూ వస్తుంది. వైసిపి కూడా ఈ బ్యాలెన్స్ కోసమే తోట త్రిమూర్తులకు ఇటీవల ఎమ్యెల్సీ పదవిని కట్టబెట్టింది. అనేక పార్టీలు మారిన తన చిరకాల ప్రత్యర్థిగా ఉన్న తోటను వైసిపిలోకి తీసుకురావడమే కాకుండా ఆయనకు ఎమ్యెల్సీ కూడా ఇవ్వడం పిల్లి సుభాష్ చంద్రబోస్ కి మనస్థాపం కలిగించిందనే టాక్ ఉంది. ఈ పోకడలతో ఆయన ప్రస్తుత పార్టీ రాజకీయాలపట్ల విరక్తితోనే అంటీముట్టనట్లే ఉన్నట్లు తెలుస్తుంది.
జగన్ తో పెరిగిన గ్యాప్ …
గతంలో ఏ కీలకమైన నిర్ణయం తీసుకున్నా అన్నా మీ మాటేమిటి అని వైసిపి అధినేత జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ కి గౌరవం ఇచ్చేవారని అయితే ఇటీవల ఆ మర్యాదలు తగ్గాయన్నది కొందరి మాట. ఇటీవల బోస్ అనని వ్యాఖ్యలకు అన్నట్లు టిడిపి సోషల్ మీడియా లో ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అని చెప్పినట్లు చూపించిన వీడియో తరువాత వైసిపి లో అలజడి రేగింది. దీనిపై పిల్లి సుభాష్ చంద్రబోస్ వివరణ కూడా ఇవ్వాలిసి వచ్చింది. ఆయనను అలా వివరణ ఇవ్వాలని అధిష్టానం ఆదేశించిందా లేక ఆయనే పార్టీ పట్ల విధేయత ప్రకటించాలిసిన పరిస్థితి వచ్చిందా అన్న అంశంపై భిన్న కథనాలు వినవస్తున్నాయి. అప్పటినుంచి అధినేత జగన్ తో పిల్లి సుభాష్ చంద్రబోస్ నడుమ గ్యాప్ మరింత పెరిగిందని తూర్పున పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. దీనితో పాటు జనరేషన్ గ్యాప్ తో పిల్లి సుభాష్ చంద్రబోస్ దూరం అయ్యి వేణు దగ్గర అయ్యి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ గ్యాప్ మరింత పెరుగుతుందా టీ కప్పులో తుఫాన్ లా చల్లారుతుందా అన్నది కాలమే తేల్చనుంది.