జగన్ వ్యూహం అర్థం కాలేదా? పిల్లి పాకులాట ఎందుకో?
రాజకీయాల్లో ఏం జరిగినా.. ఎలాంటి పదవులు దక్కినా.. ఆనంద పడిపోవడం సహజం. కానీ, ఆయా పదవులు ఇచ్చిన వారు.. ఆయా పదవుల వ్యవహారాలను పరిశీలిస్తే.. వాటి వెనుక [more]
రాజకీయాల్లో ఏం జరిగినా.. ఎలాంటి పదవులు దక్కినా.. ఆనంద పడిపోవడం సహజం. కానీ, ఆయా పదవులు ఇచ్చిన వారు.. ఆయా పదవుల వ్యవహారాలను పరిశీలిస్తే.. వాటి వెనుక [more]
రాజకీయాల్లో ఏం జరిగినా.. ఎలాంటి పదవులు దక్కినా.. ఆనంద పడిపోవడం సహజం. కానీ, ఆయా పదవులు ఇచ్చిన వారు.. ఆయా పదవుల వ్యవహారాలను పరిశీలిస్తే.. వాటి వెనుక చాలా రీజన్, ముందు చూపు ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. అయితే నేతలు ఈ విషయాన్ని గ్రహిస్తే.. తమ రాజకీయ భవితవ్యాన్ని సరిదిద్దుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇదే విషయంలో మాజీ మంత్రి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ పై వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన జగన్ వ్యూహాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఓడినా మంత్రిని చేసి….
ఎందుకంటే.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి గతంలో గెలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను గత ఎన్నికల్లో జగన్ తప్పించారు. మండపేట నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. అయితే ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ జగన్ మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఆయన్ను మండలికి పంపారు. ఆ తర్వాత మారిన సమీకరణలు.. జిల్లాపై పూర్తి అధ్యయనం చేసిన జగన్.. పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఏకంగా రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పిస్తూ.. రాజ్యసభకు పంపేశారు. అంటే దాదాపు ఆయనను నియోజకవర్గానికి దూరం చేశారు. దీనివెనుక చాలా వ్యూహం ఉంది. అదే సమయంలో టీడీపీ నుంచి తోట త్రిమూర్తులపై ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా తెచ్చుకున్నారు. ఈ క్రమంలో బోసుకు అర్ధం కావాల్సిన విషయం.. ఇక, నియోజకవర్గం నుంచి గౌరవంగా తప్పుకోవడమే.
పట్టుకుని వేలాడితే…?
కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం ఈ విషయంలో జగన్‌ను అర్ధం చేసుకోవడం లేదు. జగన్ ఎందుకు తనను రాజ్యసభకు అనూహ్యంగా పంపిచారో.. ఆయన తెలుసుకోలేక పోతున్నారని అంటున్నారు పరిశీలకులు. వయసు మీరిపోతుండడం.. ప్రజల్లో కూడా ఆదరణ సన్నగిల్లుతుండడం, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలోనే పిల్లి సుభాష్ చంద్రబోస్ కు నియోజకవర్గాన్ని దూరం చేసి.. అంతే గౌరవప్రదమైన రాజ్యసభకు పంపారు. సో.. ఆయన కు జగన్ చెప్పకనే విషయాన్ని చెప్పారు. అయినప్పటికీ.. తనదే పైచేయి అన్న విధంగా ఇంకా రామచంద్రాపురాన్ని పట్టుకుని వేలాడుతున్నారనేది బోసుపై ఉన్న వివాదం.
బోస్ రాజకీయం…..
ఇంకా.. వచ్చే ఎన్నికల్లో ఈ టికెట్‌ను దక్కించుకోవాలని.. తనకు లేదా తనకుమారుడికి ఇప్పించుకునేలా ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇది సాధ్యం కాదని.. జగన్ ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్ ను పక్కకు తప్పించేశారని.. ఆయన తెలుసుకోకపోవడమే ఆయనకు, పార్టీకి ఇబ్బందిగా ఉందని అంటున్నారు. పైగా ఇదే సీటు కోసం ప్రస్తుత మంత్రి వేణు ఓ వైపు, తోట మరో వైపు ( తాను లేదా తన కుమారుడు) పోటీ పడుతున్నారు. ఈ ఈక్వేషన్లు చూస్తే ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ రాజకీయాలు ముగిసినట్టే. ఈ సీటు ఆ ఫ్యామిలీకి ఇచ్చే ఛాన్సే లేదు. అయినా పిల్లి ఇక్కడ ఇంకా పట్టు కోసం పాకులాడుతూ తోట, వేణుతో పోటీ పడుతూ తన వర్గాన్ని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీని డిస్టర్బ్ చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా జగన్‌కు వెళుతున్నాయి.