యుద్ధం అంటే అదీ.. కేరళ సీఎం సూపర్
దేశంలో తొలి కరోనా కేసు కేరళలో బయటపడింది. ఇప్పుడుకూడా అక్కడ కరోనా విజృంభిస్తుంది. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొని బయటపడిన రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ [more]
దేశంలో తొలి కరోనా కేసు కేరళలో బయటపడింది. ఇప్పుడుకూడా అక్కడ కరోనా విజృంభిస్తుంది. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొని బయటపడిన రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ [more]
దేశంలో తొలి కరోనా కేసు కేరళలో బయటపడింది. ఇప్పుడుకూడా అక్కడ కరోనా విజృంభిస్తుంది. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొని బయటపడిన రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ రికార్డ్ లే నమోదు చేసింది. భయంకరమైన వరదలతో విలవిల్లాడినా తట్టుకుని నిలబడి అందరికి ఆదర్శంగా నిలిచింది కేరళ. ఇప్పుడు కరోనా రక్కసిని సైతం ఎదుర్కొనేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ఆ రాష్ట్ర సర్కార్ స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.
పినరయ్ విజయన్ చర్యలు భేష్ …
రాకాసి వైరస్ కట్టడి కోసం ఇప్పుడు కేరళ ప్రభుత్వం 20 వేలకో ట్ల రూపాయలను విడుదల చేసింది. ఇది ఏ రకంగా చూసినా చిన్న రాష్ట్రమైన కేరళకు మోయలేనంత భారమే. కానీ తన ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయం గా భావించిన విజయన్ ప్రభుత్వం ఏమాత్రం డబ్బు విడుదలకు వెనుకాడలేదు. స్వచ్ఛంద గృహ నిర్బంధం లో వున్న కారణంగా సమాజంలో పేద, ధనిక అనే భేదం లేకుండా అంతా ఆహార కొరతను నగదు కొరతను ఎదుర్కొనే ప్రమాదాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి సమస్యలు అధిగమించేందుకు పటిష్ట కార్యాచరణ ప్రకటించింది.
అంతా ఒక్కటే …
కేరళలో సామాజిక పింఛన్లు అందుకోని వారికి పేదా ధనిక తేడా లేకుండా వెయ్యి రూపాయలు చొప్పున ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రతి కుటుంబానికి 20 కేజీల బియ్యాన్ని ఇంటికే అందించడానికి చర్యలు చేపట్టింది. ఇక ఆకలితో ఏ ఒక్కరు చనిపోరాదని భావించి 20 రూపాయలకే భోజనం అందించే ప్రత్యేక క్యాంటిన్లు ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాటుకు సంకల్పించింది. ఇలా అనేక చర్యలతో కరోనాపై పెద్ద యుద్ధాన్నే కేరళ మొదలు పెట్టింది. పారిశుధ్య చర్యలు పెద్ద ఎత్తున చేపట్టడమే కాకుండా అన్ని విభాగాల్లో జాగర్తలు తీసుకుంటుంది కేరళ.