పితాని కథ గుట్టు రట్టు.. అడ్డంగా బుక్
ఈఎస్ఐ ఔషధాల కోనుగోళ్లలో జరిగిన వందల కోట్ల అక్రమాల్లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఆయన కుమారుడు వెంకట సురేష్‌ల పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. [more]
ఈఎస్ఐ ఔషధాల కోనుగోళ్లలో జరిగిన వందల కోట్ల అక్రమాల్లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఆయన కుమారుడు వెంకట సురేష్‌ల పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. [more]
ఈఎస్ఐ ఔషధాల కోనుగోళ్లలో జరిగిన వందల కోట్ల అక్రమాల్లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఆయన కుమారుడు వెంకట సురేష్‌ల పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మొదట్లో ఇదంతా రాజకీయ కుట్రేనని, తాము పార్టీ మారమని చెప్పడంతోనే ఇలా చేశారని.. టీడీపీ నేతల ద్వారా ఎదురుదాడి చేయించిన ఈ తండ్రీ కుమారుడు.. హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌కు అప్లయి చేయడం గమనార్హం. అయితే, కోర్టు బెయిల్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.
తాజా నివేదికలో….
అయితే, ఈ కుంభకోణం కేసులో పితాని సత్యనారాయణ హస్తం ఉందా? లేదా? అనే సందేహాలను పటాపంచలు చేస్తూ.. తాజాగా ఈ కేసును విచారిస్తున్న ఏసీపీ అధికారులు ఓ నివేదికను వెల్లడించారు. దీనిలో పితాని సత్యనారాయణ కుమారుడి హస్తం స్పష్టంగా ఉందనే విషయం తెలుస్తోంది. వెంకట సురేష్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా నొక్కేశారన్న సందేహాలు వినిపిస్తున్నాయి. రేటు కాంట్రాక్టులో లేని ఏజెన్సీల నుంచి కొనుగోళ్లు చేయడమే కాదు, ఎక్కువ రేటుకు తీసుకోవాలని సిఫార్సు చేశారు. మాజీ మంత్రి కొడుకు చేసిన ఈ వ్యవహారాలను ఈఎస్ఐ అధికారులు కొంతమంది ఏకరువు పెట్టారు.
అంతా ఆయన ద్వారానే…..
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కొడుకు స్లిప్పులు రాసి తమకు పంపించేవారని, వాటి ఆధారంగా స్లిప్పు రాసిచ్చాక మళ్లీ ఫోన్లు చేసేవారని, స్లిప్పులను తర్వాత చించేయమని ఒత్తిడి చేసేవారని కూడా వీరు తెలిపారు. ఇక, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కొడుకు సిఫార్సు చేసిన వాటిలో రేటు కాంట్రాక్టులో లేని సంస్థలే ఉండడం గమనార్హం. 2016లో తయారైన ఈ మందులు 2019 ఆగస్ట్‌తో ఎక్స్‌పెయిరీ అవుతాయన్న ఉద్దేశంతో ఆదరాబాదరాగా సరఫరా చేశారు. ఈ మందులను తిరుమల మెడికల్ ఏజెన్సీస్ సరఫరా చేసింది. ప్రస్తుతం ఈ ఏజెన్సీ అధినేత కార్తీక్ జైల్లో ఉన్నారు.
ఎలాంటి ఏజెన్సీ లేదని…..
2019 ఫిబ్రవరిలో ఈఎస్ఐ ఆస్పత్రులకు సరఫరా చేసిన మందులు నాసిరకమైనవని తిరుపతి డ్రగ్ ఇన్స్పెక్టర్ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్‌కు పంపడంతో పితాని సత్యనారాయణ ఒత్తిళ్ల మేరకు డైరెక్టర్ చర్యలు తీసుకోలేదు. తిరుమల ఏజెన్సీస్ విజయవాడలోని భవానీపురంలో ఓ అపార్ట్మెంట్ చిరునామా ఇచ్చారు. పోలీసుల విచారణలో ఆ చిరునామాలో ఇలాంటి ఏజెన్సీనే లేదని తేలింది. మాత్రలు నాసిరకం అని తేలిన మరుసటి రోజునే ఆ చిరునామా ఇంటికి నోటీసు అతికించగా.. ఎవరూ స్పందించలేదు.
బీసీ సంఘాల నేతలతో…..
సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టకపోవడంతో పితాని సత్యనారాయణ స్వయానా ఏజెన్సీని కాపాడేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. ఇలా మొత్తం విషయం బయటపడడంతో ఇక, పితాని కుమారుడు కూడా ఊచలు లెక్కించాల్సిందేనని అంటున్నారు విశ్లేషకులు. అదే సమయంలో పితాని ఈ కేసు నుంచి బయట పడేందుకు అవసరం అయితే పార్టీ మారేందుకు కూడా రెడీ అవుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఆయన కొద్ది రోజులుగా తన ఇంట్లో వరుసగా బీసీ సంఘాల నేతలతో సమావేశం అవుతూ వస్తున్నారు.
వైసీపీలో చేరేందుకు……
ప్రస్తుతం వైసీపీలో తనకు దారులు మూసుకు పోవడంతో బీసీ కులాలన్నింటిని సమీకరించి తన సత్తా చాటి మరీ పార్టీ మారితే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. అయితే వైసీపీలో కూడా ఇప్పుడు పితాని సత్యనారాయణ కోసమే అన్నట్టుగా ఓ సీటు కూడా ఖాళీ అవుతోంది. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును పార్టీ వదిలించుకోవాలని చూస్తుండడంతో ఆయన బయటకు వెళితే పితాని పార్టీలోకి వస్తే బీసీ కోటాలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పగ్గాలు ఇవ్వాలని చూస్తోందట. మరి పితాని సత్యనారాయణ ఈ గండంలో కూరుకు పోతారా ? లేదా పార్టీ మారి సేఫ్ అవుతారా ? అన్నది చూడాలి.