ఆరేళ్ల క్రితం వారు కాదు…వారిద్దరూ అంతే…?
వారిద్దరూ అంతే. తమకు అవసరమనుకుంటే వారే అపాయింట్ మెంట్లు ఇచ్చేస్తారు. తీపి కబుర్లు చెబుతారు. అదే తమ అవసరం వారికుందని గుర్తిస్తే ఒక ఆట ఆడుకుంటారు. అసలు [more]
వారిద్దరూ అంతే. తమకు అవసరమనుకుంటే వారే అపాయింట్ మెంట్లు ఇచ్చేస్తారు. తీపి కబుర్లు చెబుతారు. అదే తమ అవసరం వారికుందని గుర్తిస్తే ఒక ఆట ఆడుకుంటారు. అసలు [more]
వారిద్దరూ అంతే. తమకు అవసరమనుకుంటే వారే అపాయింట్ మెంట్లు ఇచ్చేస్తారు. తీపి కబుర్లు చెబుతారు. అదే తమ అవసరం వారికుందని గుర్తిస్తే ఒక ఆట ఆడుకుంటారు. అసలు వారు ఉన్నట్లే పట్టించుకోరు. వారే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలుగు రాజకీయాల్లో వీరిద్దరూ ఇప్పుడు రెండు పార్టీలను తమ కాళ్ల చెంతకు చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లే ఉన్నారు. అందుకే వారిరువరూ తెలుగు రాజకీయాలను పెద్దగా పట్టించుకోనట్లే కన్పిస్తున్నారు.
2014 ఎన్నికలకు ముందు…..
2014 ఎన్నికలకు ముందు మోదీ స్వయంగా పవన్ కల్యాణ్ ను కలిశారు. చాలా సేపు ముచ్చటించారు. అదే ఎన్నికల సందర్భంగా చంద్రబాబుతోనూ వివిధ వేదికలతో పంచుకున్నారు. చంద్రబాబును తన మిత్రుడుగా మోదీ చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ కల్యాణ్ సయితం ప్రత్యేక హోదా విషయంలో మోదీ, అమిత్ షాలపై నిప్పులు చెరిగారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్యాకేజీపై విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీకి పవన్ కల్యాణ్ దూరమయినట్లే కన్పించింది.
పవన్ న కలిసేందుకు కూడా…..
తాజాగా పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. పొత్తు సందర్భంలోనూ, పవన్ కల్యాణ్ బీజేపీకి చేరువయ్యే సమయంలోనూ పవన్ కల్యాణ్ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను మాత్రమే కలిశారు. అమిత్ షా, నరేంద్ర మోదీలను కలవలేకపోయారు. దీనికి కారణాలు ఏమైనప్పటికీ పవన్ ను నేరుగా వారు కలిసేందుకు ఇష్టపడటకపోవడమే నంటున్నారు. టీడీపీని దెబ్బతీయాలంటే పవన్ కల్యాణ్ అవసరం ఉందని భావించి తమ నీడలో చోటు కల్పించారు.
బాబును దరిచేర్చుకుంటారా? డౌటే……
చంద్రబాబుతో పోలిస్తే పవన్ కల్యాణ్ మోదీ, అమిత్ షాలపై చేసిన విమర్శలు తక్కువనే చెప్పాలి. పవన్ కల్యాణ్ కే అపాయింట్ మెంట్ ఇవ్వని ఈ ఇద్దరు బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు విషయంలో దిగి వస్తారని మాత్రం చెప్పలేం. ఎందుకంటే వారి ముందున్నది చంద్రబాబును మరింత బలహీనపర్చడమే. అందుకే చంద్రబాబు ఎంత తాపత్రయపడినా వారిద్దరూ ఇప్పట్లో కరుణించరన్నది ఢిల్లీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. మరి చంద్రబాబు సంధికోసం చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు ఫలవంతమవుతాయో చూడాలి.