తప్పుకుంటారా? సరేనని అంగీకరిస్తారా?
తమిళనాడులో ఎన్నికల సందడి మొదలయింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తమిళనాడు ఎన్నికలు జరిగే అవకాశముంది. అయితే కూటమిలోని పార్టీలు ఎక్కువ స్థానాలను ఆశిస్తుండటం పార్టీలకు ఇబ్బందికరంగా [more]
తమిళనాడులో ఎన్నికల సందడి మొదలయింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తమిళనాడు ఎన్నికలు జరిగే అవకాశముంది. అయితే కూటమిలోని పార్టీలు ఎక్కువ స్థానాలను ఆశిస్తుండటం పార్టీలకు ఇబ్బందికరంగా [more]
తమిళనాడులో ఎన్నికల సందడి మొదలయింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తమిళనాడు ఎన్నికలు జరిగే అవకాశముంది. అయితే కూటమిలోని పార్టీలు ఎక్కువ స్థానాలను ఆశిస్తుండటం పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నేతృత్వం వహిస్తున్న కూటమిలో కొన్ని పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో పీఎంకే అధినేత రాందాస్ ముందున్నారు.
40 స్థానాలు కావాలంటూ….
పీఎంకే ఈసారి తమకు 40 స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు పీఎంకే ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కేటాయించాలని కోరుతుంది. అలా ఇవ్వకుంటే తాము కూటమి నుంచి తప్పుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పీఎంకే ఈ రకమైన సంకేతాలను అన్నాడీఎంకే అధినాయకత్వానికి పంపింది. అయితే అన్ని స్థానాలను ఇచ్చేందుకు అన్నాడీఎంకే మాత్రం సిద్దంగా లేదు.
బలమైన సామాజికవర్గం…..
తమిళనాడులో పీఎంకే కొంత బలమైన పార్టీ అనే చెప్పాలి. వన్నియార్లు ఈ పార్టీకి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. ఇప్పటికే వన్నియార్లకు రిజర్వేషన్లను కల్పించాలని కోరుతూ పీఎంకే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. వన్నియార్లకు విద్యా, ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లను కల్పించాలని, వెనకబడిన సామాజికవర్గాలకు ఆంధ్రప్రదేశ్ తరహాలో కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని పీఎంకే డిమాండ్ చేస్తుంది. ఎన్నికల వేళ ఇది అన్నాడీఎంకే తలనొప్పిగా మారింది.
పట్టున్న ప్రాంతాల్లో…..
తమిళనాడులో ఉత్తరాది జిల్లాల్లో పీఎంకే కు మంచి పట్టుంది. అందుకే మొత్తం తమకు బలం ఉండి, తమ పార్టీ ప్రభావితం చేయననున్న 60 శాసనసభ నియోజకవర్గాల జాబితాను పీఎంకే సిద్ధం చేసుకుంది. అన్నాడీఎంకే అధినాయకత్వానికి ఈ జాబితాను అందించింది. 60 అసెంబ్లీ స్థానాల్లో 40 స్థానాలను తమకు కేటాయించాలని పీఎంకే కోరుతుంది. కానీ అన్నాడీఎంకే ఈ ప్రతిపాదన అంగీకరించే అవకాశాలు లేవు. దీంతో పీఎంకే కూటమి నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.