ఆ మాత్రం ఆలోచించరా? ఇంగిత జ్ఞానం లేదా?
కరోనా ఎఫెక్ట్ బాగా ఎక్కువ హై రిస్క్ ఉన్న వారిలో పోలీసులు కూడా ఒకరు. తప్పనిసరిగా ప్రజల్లో ఉంటూ ఉద్యోగం చేయాలిసిన పరిస్థితి వారిది. ఒక పక్క [more]
కరోనా ఎఫెక్ట్ బాగా ఎక్కువ హై రిస్క్ ఉన్న వారిలో పోలీసులు కూడా ఒకరు. తప్పనిసరిగా ప్రజల్లో ఉంటూ ఉద్యోగం చేయాలిసిన పరిస్థితి వారిది. ఒక పక్క [more]
కరోనా ఎఫెక్ట్ బాగా ఎక్కువ హై రిస్క్ ఉన్న వారిలో పోలీసులు కూడా ఒకరు. తప్పనిసరిగా ప్రజల్లో ఉంటూ ఉద్యోగం చేయాలిసిన పరిస్థితి వారిది. ఒక పక్క శాంతిభద్రతల పరిరక్షణ చేయాలి. అలాగే క్రైమ్, ట్రాఫిక్ విధులు నిర్వహించాలి. ఇవి కాక విఐపి ల భద్రత ప్రోటోకాల్ విధులు ఉండనే ఉన్నాయి. వీటికి తోడు లాక్ డౌన్ నిబంధనలు సడలింపులతో రాజకీయ పార్టీల హడావిడి మొదలై పోయింది. ధర్నాలు, నిరసనలు, దీక్షలు ఎపి లో బాగా స్పీడ్ అందుకున్నాయి. వీటితో పాటు మత రాజకీయాలు సైతం ఎపి లో పోలీసులకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి.
తూగోలో ఎస్పీతో సహా …
అంతర్వేదిలో స్వామి వారి రథం దగ్ధం పోలీసుల ప్రాణాలమీదకు వచ్చింది. జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి తో సహా అడిషనల్ ఎస్పీ పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా పరీక్షల్లో తేలడం ఆందోళన కలిగించింది. వీరంతా ప్రస్తుతం క్వారంటైన్ లోకి వెళ్లిపోవడం చర్చనీయాంశం అయ్యింది. రాళ్లు విసిరిన ఆందోళనకారుల్లో కొందరికి సైతం కరోనా సోకింది. వీరినుంచే పోలీసు అధికారులకు సిబ్బందికి సోకినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్వేదిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ బందోబస్తు చేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది.
రాజకీయ పార్టీలు దూకుడు తగ్గడం లేదు …
ప్రస్తుతం ఎపి రాజకీయాలు హాట్ హాట్ గానే నడుస్తున్నాయి. అధికారపార్టీ సహా విపక్షాలు జాగ్రత్తగా ఉండాలిసిన సమయంలో కరోనా వ్యాప్తికి కారణం అయ్యే కార్యక్రమాలను చేపడుతున్నాయి. దాంతో ఈ కార్యక్రమాల కవరేజ్ కి వెళ్ళే మీడియా వారితో సహా పోలీసులకు వైరస్ తగులుకుంటుంది. కరోనా సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలో కూడా కనీస ఇంగిత జ్ఞానం రాజకీయ పార్టీలకు లేకపోవడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. అయితేనేమి ఎవరూ ఎక్కడా తగ్గేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా వైరస్ వ్యాప్తి సైతం ఎపి లో దూసుకుపోతుంది.