జగన్ గేమ్ లో టిడిపి చిక్కుతుందా …?
తాము అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ వర్గం ఓటు బ్యాంక్ కొల్లగొట్టింది 2014 ఎన్నికల్లో టిడిపి. తీరా అధికారం చేపట్టాకా కొద్దికాలం మౌనం [more]
తాము అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ వర్గం ఓటు బ్యాంక్ కొల్లగొట్టింది 2014 ఎన్నికల్లో టిడిపి. తీరా అధికారం చేపట్టాకా కొద్దికాలం మౌనం [more]
తాము అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ వర్గం ఓటు బ్యాంక్ కొల్లగొట్టింది 2014 ఎన్నికల్లో టిడిపి. తీరా అధికారం చేపట్టాకా కొద్దికాలం మౌనం దాల్చింది. ముద్రగడ పద్మనాభం రూపంలో ఉద్యమం పుట్టడం ప్రశ్నించడం మొదలు కావడంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి అంతటితో సరిపెట్టారు చంద్రబాబు. ఇక 2019 ఎన్నికల ముందు కేంద్రం ఇచ్చిన ఈబిసి రిజర్వేషన్ పదిశాతం లో ఐదు శాతం కాపులకు కేటాయిస్తున్నామని ప్రకటించారు బాబు. అయితే ఇందులో సాంకేతిక అంశాలను కానీ మరేమి అధ్యయనం చేయకుండా ఓటు బ్యాంక్ కోసమే తొందరపడ్డారు టిడిపి అధినేత. బిసిల్లో చేరుస్తామని ప్రకటించిన తెలుగుదేశం చివరకు అగ్రవర్ణ పేదల్లో కలిపామని చెప్పడం ఆ రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారో స్పష్టం చేయకపోవడంతో ఎన్నికల్లో బోల్తా పడింది. బాబు హామీని నమ్మని కాపులు జనసేన, వైసిపి వైపు గోదావరి జిల్లాల్లో మొగ్గుచూపారు. ఫలితం జగన్ అఖండ విజయం సాధించారు.
జగన్ చెప్పినట్లే చేశారు ….
కాపుల అడ్డాగా వున్న గోదావరి జిల్లాలోని జగ్గంపేట లో కాపు రిజర్వేషన్ అంశం తన చేతుల్లో లేదని తన పాదయాత్ర లో స్పష్టం చేశారు వైసిపి అధినేత. కేంద్రం చేతిలో వున్న ఈ సున్నిత అంశం పై పెను దుమారమే రేగింది. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. కార్పొరేషన్ నిధులను రెండువేలకోట్ల రూపాయలకు పెంచి మరింతగా పెదకాపులకు అండ కల్పిస్తామని చెప్పి అదే చేశారు అధికారం లోకి వచ్చాకా. అక్కడితో ఆగలేదు. చంద్రబాబు ప్రకటించిన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లలో ఐదు శాతం సాధ్యం కాదని తీసేసారు. ఈ నిర్ణయాన్ని రాజకీయ అంశంగా మలుచుకుని టిడిపి కాపు నేతలు వైసిపి సర్కార్ తో యుద్ధానికి సిద్ధం అయ్యారు. ఎలాంటి వత్తిడి వచ్చినా వెనక్కి తగ్గేది లేదని జగన్ ఇప్పటికే స్పష్టం చేయడంతో భవిష్యత్తులో దీనిపై కాపు రిజర్వేషన్ పోరాట సమితి కార్యాచరణ ఏవిధంగా వుండబోతుందన్న చర్చ నడుస్తుంది.
టిడిపికి ముందు నుయ్యి వెనుక గొయ్యి ….
కాపు రిజర్వేషన్ల అంశం పై టిడిపి పోరాడితే బిసిలతో ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఇటు కాపులు, అటు బిసిలు దూరం జరిగారని ఫలితాల్లో వచ్చిన ఓట్లు చెప్పక చెప్పాయి. కాపుల రిజర్వేషన్ కోసం చంద్రబాబు కార్యాచరణ తో ముందుకు వెళ్లడం బిసి సామాజిక వర్గంలో మొదటినుంచి తీవ్ర అసంతృప్తి కొనసాగింది. ఇప్పుడు కూడా టిడిపి ఈ అంశం పై ఏ స్థాయిలో ఉద్యమిస్తే అదే స్థాయిలో బిసి వర్గం మరింత గా ఆ పార్టీకి దూరం జరిగిపోవడం ఖాయమంటున్నారు.టిడిపి కి తొలినుంచి ఓటు బ్యాంక్ వెనుకబడిన వర్గాలే వెన్నెముకగా నిలుస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో టిడిపి కి కాపు రిజర్వేషన్ ల అంశంలో ముందు నుయ్యి, వెనక గొయ్యిగా వుంది. మరి ఈ సమస్యను చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి.