అసలు విషయం తేలేది అప్పుడేనట?
తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన బంధంపై కూడా ఫలితం ప్రభావం ఉండనుంది. తిరుపతిలో పట్టుబట్టి [more]
తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన బంధంపై కూడా ఫలితం ప్రభావం ఉండనుంది. తిరుపతిలో పట్టుబట్టి [more]
తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన బంధంపై కూడా ఫలితం ప్రభావం ఉండనుంది. తిరుపతిలో పట్టుబట్టి మరీ బీజేపీ తన అభ్యర్థిగా రత్న ప్రభను బరిలోకి దించింది. జనసేన పోటీ చేయాలనుకున్నా పవన్ కల్యాణ్ ను ఒప్పించి మరీ సీటును తాము తీసుకున్నారు. రత్న ప్రభను అన్ని కోణాల్లో ఆలోచించి మరీ బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసింది.
పవన్ మద్దతు తెలిపినా?
పవన్ కల్యాణ్ కూడా రత్న ప్రభకు మద్దతుగా ఒక విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రత్న ప్రభను గెలిపించాలని జనసేన అధినేత పిలుపునిచ్చారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో కేవలం వైసీపీనే టార్గెట్ చేశారు. చంద్రబాబు ఊసే ఎత్తలేదు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కల్యాణ్ వైసీపీనే టార్గెట్ చేసుకున్నారు.
బదిలీ అవుతాయా?
దీంతో జనసేన ఓటు బ్యాంకు బీజేపీకి పడుతుందా? లేదా? అన్న సందేహాలు సర్వత్రా తలెత్తాయి. జనసేన, బీజేపీ పొత్తు తర్వాత తొలిసారి జరుగుతున్న అతి పెద్ద ఎన్నిక ఇది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుమీద జరిగినా స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ పొత్తులు కుదుర్చుకున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీజేపీ కంటే జనసేనకు బలం ఎక్కువగా ఉంది. కాపు సామాజికవర్గం ఓట్లతో పాటు పవన్ అభిమానులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు.
కష్టమేనట…
అయితే బీజేపీ తమ అధినేత పట్ల వ్యవహరిస్తున్న తీరుపట్ల జనసేన క్యాడర్ మండిపడుతుంది. పవన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఇది తిరుపతి ఉప ఎన్నిక కోసమేనని వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రచారంలోనూ జనసేన క్యాడర్ పెద్దగా పాల్గొనకపోవడం ఇందుకు మరింత సందేహాలను ఇస్తుంది. జనసేన అధినేత మద్దతు తెలిపినా తాము బీజేపీకి ఓటు వేసే ప్రసక్తి లేదని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. దీంతో జనసేన ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ కావడం జరగని పని అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత దీనిపై స్పష్టత రానుంది. ఈ తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.