జేసీ ఫ్యామిలీలో పొలిటికల్ సంక్షోభం.. చీలిక వస్తుందా?
అనంతపురం జిల్లాలో కీలక రాజకీయ నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ మధ్య పొలిటికల్ కల్లోలం జరుగుతోందా? జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డిల మధ్య కొన్నాళ్లుగా [more]
అనంతపురం జిల్లాలో కీలక రాజకీయ నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ మధ్య పొలిటికల్ కల్లోలం జరుగుతోందా? జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డిల మధ్య కొన్నాళ్లుగా [more]
అనంతపురం జిల్లాలో కీలక రాజకీయ నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ మధ్య పొలిటికల్ కల్లోలం జరుగుతోందా? జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డిల మధ్య కొన్నాళ్లుగా రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయా ? అంటే.. ఔననే అంటున్నా రు పరిశీలకులు. 2014 ఎన్నికలకు ముందు వరకు.. కూడా ఈ వర్గం.. కాంగ్రెస్‌లో చక్రం తిప్పింది. అయితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో జేసీ కుటుంబం మొత్తం టీడీపీలోకివచ్చింది. అప్పటి ఎన్నికల్లో దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ప్రభాకర్‌రెడ్డి.. తాడిపత్రి నుంచి టీడీపీ టికెట్‌పై విజయం సాధించి.. తమ సత్తా నిలబెట్టుకున్నారు.
ఇద్దరూ బరి నుంచి…?
కానీ, 2019 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకొని.. వారి వారసులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలోనే అనంత ఎంపీగా పవన్ కుమార్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా.. అస్మిత్‌రెడ్డి పోటీ చేశారు. అయితే.. జగన్ సర్కారు కొలువు దీరిన తర్వాత.. ఈ కుటుంబం రాజకీయంగా ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేసులు, జైళ్లు కూడా తప్పలేదు. ఈ నేపథ్యంలో దివాకర్ రెడ్డి… తమను టీడీపీ పట్టించుకోవడం లేదని.. బహిరంగంగానే విమర్శలుచేశారు. ఇటీవల చంద్రబాబు కూడా చిత్తూరు వరకు వెళ్లి పీఆర్ మోహన్ కుటుంబాన్ని పరామర్శించినా.. తమ వద్దకు మాత్రం రాలేదని.. రెండు రోజుల కిందట కూడా దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రదర్స్ మధ్య….?
ఈ క్రమంలో దివాకర్ రెడ్డి బీజేపీవైపు చూస్తున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక, ప్రభాకర్ రెడ్డి విషయానికి వస్తే.. రెండు మాసాల కిందట జరిగిన స్థానిక ఎన్నికల్లో తాడిపత్రి మునిసిపాలిటీని దక్కించుకున్నారు. అయితే.. ఆయన ఎన్నికలు ముగిసి.. చైర్మన్‌గా తను పగ్గాలు చేపట్టిన తర్వాత.. చంద్రబాబు మాటైనా ఎత్తకుండా.. ఏకంగా జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. జగన్ లేకపోతే.. నేను లేను.. పదవి దక్కేదీ కాదన్నారు. దీంతో ఈయన వ్యవహారంపై చంద్రబాబు గుస్సాగా ఉన్నారు. ఇంతలోనే మళ్లీ టంగ్ మార్చుకుని.. తాను టీడీపీ వాదినేనని.. పార్టీ కోసం పనిచేస్తానని .. తాజాగా వెల్లడించారు.
ఎటు ఉన్నారో?
ఈ రెండు విరుద్ధ వ్యవహారాలపై అన్నదమ్ముల మధ్య విభేదాలు వ్యక్తమయ్యాయని తెలుస్తోంది. ప్రభాకర్.. ఎటు ఉన్నారో అంతుచిక్కడం లేదని.. టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పైగా పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా ఆయనను పిలవడం లేదు. అదేసమయంలో ఆయన కూడా తాను ఎటున్నానో.. ఇతమిత్థంగా చెప్పలేక పోతున్నారు. దివాకర్ రెడ్డి మాత్రం బీజేపీ నేతలు.. తనకు రాజ్యసభ టికెట్ ఇస్తానంటే.. వెంటనే.. కమలం కండువా కప్పుకొంటానని క్లూ ఇస్తున్నారు.
వారసులు కూడా..?
ఇక జేసీ జేసీ బ్రదర్స్ వారసుల్లో పవన్ కుమార్ రెడ్డి టీడీపీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తుంటే అశ్మిత్ రెడ్డి మాటే ఎక్కడా వినపడడం లేదు. పవన్‌లో ఉన్న కసి అశ్మిత్లో లేదనే అంటున్నారు. అశ్మిత్ జగన్ పట్ల సానుకూలంగా ఉన్నట్టు టాక్ ? దీంతో జేసీ బ్రదర్స్ రాజకీయంపై స్థానికంగా.. విమర్శలు, విశ్లేషణలు పెరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఎటు వైపు మొగ్గు చూపుతారో.. అంటున్నారు పరిశీలకులు.