బీజేపీ పెద్దతలకాయనే బుట్టలో వేశారా?
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు బీజేపీ అధిష్టానాన్ని సయితం విస్మయపరుస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ బీజేపీ నేతలు చేస్తున్న కార్యక్రమాలు, వ్యవహారాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి. [more]
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు బీజేపీ అధిష్టానాన్ని సయితం విస్మయపరుస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ బీజేపీ నేతలు చేస్తున్న కార్యక్రమాలు, వ్యవహారాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి. [more]
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు బీజేపీ అధిష్టానాన్ని సయితం విస్మయపరుస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ బీజేపీ నేతలు చేస్తున్న కార్యక్రమాలు, వ్యవహారాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి. అధికార వైసీీపీ, ప్రతిపక్ష బీజేపీతో సమాన దూరం పాటించాలని పార్టీ హైకమాండ్ స్పష్టంగా చెప్పింది. ఆ మేరకే వెళ్లాలని కూడా సూచనలు చేసింది. అయితే కొందరు బీజేపీ నేతలు పార్టీని ఒక పావుగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుస్తారన్న విషయాన్ని హైకమాండ్ దృష్టికి వచ్చింది.
నాలుగు నెలల నుంచే……
ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు ఒక నాలుగు నెలల నుంచే తీవ్రమయినట్లు అధిష్టానం గుర్తించినట్లు తెలిసింది. ముఖ్యంగా అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఇవి మరింత ఎక్కువయినట్లు బీజేపీ నేతలే కొందరు అంగీకరిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలను చేపట్టిన జేపీ నడ్డాను కొందరు ఇన్ ఫ్లూయెన్స్ చేస్తున్న విషయం మోడీ, అమిత్ షా దృష్టికి వచ్చినట్లు ఢిల్లీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇన్ ఫ్యూయెన్స్ చేస్తూ…..
ప్రధానంగా సుజనా చౌదరి జేపీ నడ్డాకు అత్యంత చేరువయ్యారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ప్రభావంతోనే జేపీ నడ్డా కొందరు బీజేపీ నేతలకు సూచనలు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా ఉంది. కోవిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు విషయంలో ఆరోపణల దగ్గర నుంచి రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ అధిష్టానం గమనిస్తుంది. కోవిడ్ టెస్ట్ కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలను బీజేపీ అధిష్టానం తప్పుపట్టినట్లు వార్తలు వచ్చాయి.
హైకమాండ్ సీరియస్…..
ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం దీనిపై పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ ను వివరణ కోరినట్లు తెలిసింది. ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో భేటీపై పార్టీ పరువును తీశారని హైకమాండ్ భావిస్తుంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర బీజేపీలోని కొందరు టీడీపీ వ్యతిరేక నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మోడీ, అమిత్ షాలు జేపీ నడ్డా వివరణ కూడా కోరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వైసీపీతో ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని బీజేపీ అధిష్టానం నేతలను కట్టడి చేయాలన్న నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు.