పొంగులేటి పూనకం అందుకేనా?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఆరేళ్ల వరకూ ఓటమి లేదు. జరిగే ప్రతి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ముందే ఖరారవుతూ వచ్చింది. కానీ దుబ్బాక [more]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఆరేళ్ల వరకూ ఓటమి లేదు. జరిగే ప్రతి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ముందే ఖరారవుతూ వచ్చింది. కానీ దుబ్బాక [more]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఆరేళ్ల వరకూ ఓటమి లేదు. జరిగే ప్రతి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ముందే ఖరారవుతూ వచ్చింది. కానీ దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకోని ఫలితాలు సాధించకపోవడంతో పార్టీలో వాయిస్ పెరుగుతుంది. ఇది ఊహించిందే. పదవులు రాని, తమకు టీఆర్ఎస్ లో భవిష్యత్ లేదని భావించే నేతలు ఇప్పుడిప్పుడే స్వరం పెంచుతున్నారు. ఇందులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు.
పార్టీలో చేరినా….
పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. రాష్ట్రం విడిపోవడం, వైసీపీ ఏపీకే పరిమితమవ్వడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పట్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో చేరిపోయారు. పదవీ కాలం పూర్తయ్యేంతవరకూ పార్టీలో ఆయన హవా బాగానే నడిచింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ ఇవ్వకుండా ఆయన స్థానంలో నామా నాగేశ్వరరావుకు అధిష్టానం టిక్కెట్ కేటాయించింది.
టిక్కెట్ ఇవ్వకపోవడంతో…..
అప్పటి వరకూ పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఆయన రాజ్యసభ పదవిని ఆశించారు. రాలేదు. తర్వాత ఎమ్మెల్సీ పదవి అయినా వస్తుందని భావించారు. కానీ అధిష్టానం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని ఒంటరి చేసే యత్నం జరుగుతుంది. మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు పొంగులేటి వర్గానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఒంటరి చేయడంతో….
తన వెంట ఉన్న కార్యకర్తలకు కనీసం న్యాయం చేయలేకపోతుందన్న ఆవేదనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అందుకే ఆయన ఇటీవల బరస్ట్ అయ్యారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గట్టిగా చెప్పారు. టీడీపీ నుంచి వచ్చిన సండ్ర వెంకటవీరయ్యకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కక్షపూరిత రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తన అవసరం ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారకపోయినా హైకమాండ్ తన విషయంలో దిగివస్తుందనే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.