జగన్కు పీకే ఇచ్చిన సలహా ఇదేనా ?
వైసీపీ అధినేత, సీఎం జగన్తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. దీనిపై ఇప్పటికే అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. [more]
వైసీపీ అధినేత, సీఎం జగన్తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. దీనిపై ఇప్పటికే అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. [more]
వైసీపీ అధినేత, సీఎం జగన్తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. దీనిపై ఇప్పటికే అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. దాదాపు 18 నెలల తర్వాత.. అంటే గత 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో జగన్ సర్కారు ఏర్పడిన అనంతరం ప్రశాంత్ కిశోర్ బృందం ఏపీ నుంచి మకాం మార్చేసింది. అనంతరం బిహార్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల విషయంలో ప్రశాంత్ కిశోర్ టీం పనిచేస్తోంది. అయితే ఇన్నాళ్ల తర్వాత సరైన కారణం లేకుండానే ప్రశాంత్ కిశోర్ ఏపీకి రావడం.. సీఎం జగన్తో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి కలిగించింది. నిజానికి ఇటు సీఎం జగన్ కానీ, అటు పీకే కానీ ఖాళీగా లేరు.
ఇద్దరూ బీజీ అయినా…?
బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ అక్కడ బిజీగా ఉన్నారు. పీకే దేశవ్యాప్తంగా బీజేపీని గట్టిగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇక ఏపీలో వివిధ పథకాల అమలు .. ఆర్థిక సమస్యలు, మరోవైపు.. ఆలయాలపై దాడుల నేపథ్యంలో విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక జగన్ కూడా అంతకన్నా బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీ – బీజేపీ వైసీపీ ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. అయినా ప్రశాంత్ కిశోర్-జగన్ హఠాత్తుగా 18 మాసాల అనంతరం భేటీ కావడంతో ఏం జరిగి ఉంటుందనే ప్రచారం జోరుగా సాగు తోంది. దీనిపై అనేక విశ్లేషణలు వచ్చినా.. ఇతమిత్థంగా ఏం జరిగిందనే విషయంపై వైసీపీలో సీనియర్ల మధ్య చర్చ సాగుతోంది. దీనిని బట్టి.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిణామాలకన్నా.. భవిష్యత్తులో పరిణామాలపై జగన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
సోషల్ ఫ్రెండ్ పేరుతో….
అంటే.. కీలకమైన సీఎం పదవి విషయంలో తనపై ఉన్న కేసులు విచారణ దశలో ఉన్నందున అవి కొలిక్కి వచ్చి.. తాను కేంద్ర ప్రభుత్వానికి టార్గెట్గా మారితే ఏం చేయాలనే విషయంపై చర్చించినట్టు సీనియర్లు చెబుతుండడం సంచలనం సృష్టించింది. ఇక, ప్రస్తుతం వార్డు వాలంటీర్ వ్యవస్థ మాదిరిగానే త్వరలోనే 'సోషల్ ఫ్రెండ్' పేరుతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి కూడా ప్రశాంత్ కిశోర్ నుంచి సలహాలు తీసుకున్నారని సమాచారం.
డిజిటల్ వారధి….
ఈ కార్యక్రమం ద్వారా.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య డిజిటల్ వారధిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా మంత్రి వర్గ మార్పు, కూర్పుపై కూడా ఈ దఫా పీకేతో చర్చించినట్టు సమాచారం. మొత్తంగా పైకి చెబుతున్న విషయాలకు, అంతర్గతంగా చర్చించిన విషయాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు సీనియర్ నాయకులు. ఏదేమైనా.. ప్రశాంత్ కిశోర్ తో జగన్ చర్చలు మాత్రం హైరేంజ్లోనే ఉన్నాయన్నది వాస్తవం.