పీకే విషయంలో తర్జన భర్జన .. రీజనేంటి..?
వచ్చే ఎన్నికలు కూడా ఏపీలో ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. గతంలో 2019 ఎన్నికల్లో ఏపార్టీకి ఆ పార్టీకి వ్యక్తిగతంగా పోటీ చేయడంతో వైసీపీ విజయం నల్లేరుపై నడకే అయింది. [more]
వచ్చే ఎన్నికలు కూడా ఏపీలో ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. గతంలో 2019 ఎన్నికల్లో ఏపార్టీకి ఆ పార్టీకి వ్యక్తిగతంగా పోటీ చేయడంతో వైసీపీ విజయం నల్లేరుపై నడకే అయింది. [more]
వచ్చే ఎన్నికలు కూడా ఏపీలో ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. గతంలో 2019 ఎన్నికల్లో ఏపార్టీకి ఆ పార్టీకి వ్యక్తిగతంగా పోటీ చేయడంతో వైసీపీ విజయం నల్లేరుపై నడకే అయింది. దీనికి తోడు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర, టీడీపీ నేతల అవినీతి ఆరోపణలు వంటివి బాగానే వర్కవుట్ అయ్యాయి. జగన్ ఒక్క ఛాన్స్ నినాదం కూడా బాగా ప్లస్ అయ్యింది. ఇక, వీటికితోడు.. వైసీపీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) వ్యూహాలు కూడా వైసీపీకి కలిసి వచ్చాయి. దీంతో వైసీపీ విజయం నల్లేరుపై నడకలా సాగిపోయింది. అయితే.. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా మారిపోనుంది.
సమీకరణాలు మారుతుండటంతో…?
టీడీపీ-జనసేనలు సంయుక్తంగా పోటీ కి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇతర పక్షాలు కూడా కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ కూడా జనసేన, టీడీపీతో కలుస్తుందా ? అన్న సందేహం కూడా ఉంది. 2014 ఎన్నికల ముందు పొత్తులు ఎలా ఉన్నాయో ? అవే రిపీట్ అవుతున్నాయా ? అన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. దీనికితోడు కొన్ని రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం, రాజధాని అమరావతి అంశం సహా అభివృద్ధి లేక పోవడం వంటివి కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి గత 2019 ఎన్నికల్లో సాధించిన సీట్లు వచ్చే అవకాశం లేదని అంచనా ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
ఐదేళ్ల అధికారం తర్వాత కూడా..?
అయితే.. దీనిపైనే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అంటే.. ప్రభుత్వం లేదు.. కాబట్టి సలహాలు తీసుకున్నారు. ఇప్పడు ఐదేళ్ల పాలన తర్వాత కూడా .. ఇంకా ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటే.. ప్రతిపక్షాల నుంచి మరిన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ప్రజలకు వైసీపీ ఎలాంటి పాలన అందిస్తుందనే ఉత్సుకత ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐదేళ్ల పాలన తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటే.. ప్రభుత్వం పక్షాన ప్రజలకు చేసింది ఏమీలేదనే సంకేతాలు వెళ్లడంతోపాటు.. పార్టీ సంస్థాగతంగా ఆధారపడడం మానేసి సలహాలు, వ్యూహాలపైనే ఆధారపడుతోందనే సంకేతాలు వెళ్తాయని సీనియర్లు అంటున్నారు.
జగన్ సాయం కోసం…?
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ముందే ప్రశాంత్ కిషోర్ వచ్చి జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రశాంత్ కిషోర్ తాను ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోనని ప్రకటించేశారు. జాతీయ స్థాయిలో ఆయన మోడీ వ్యతిరేకులను అందరిని ఒకే తాటిమీదకు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ మళ్లీ జగన్ కోసం సాయం చేసే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి. ఇక వైసీపీ తొలిసారి పీకే వ్యూహాలు తీసుకున్నా… మలిసారి పార్టీ పాలననే అజెండా చేసుకుని ముందుకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. మరి దీనిపై సీఎం జగన్ ఏమంటారో చూడాలి.