Prasanth kishore : సీన్ సెట్ చేస్తారా? ఏపీలో పీకే ఫీవర్
వరస విజయాలు సాధించి పెడుతున్న వారెవరినైనా లైట్ గా తీసుకోరు. అలా తీసుకుంటే వాళ్ల ఓటమిని వాళ్లు కొని తెచ్చుకున్నట్లే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత్ కిషోర్ [more]
వరస విజయాలు సాధించి పెడుతున్న వారెవరినైనా లైట్ గా తీసుకోరు. అలా తీసుకుంటే వాళ్ల ఓటమిని వాళ్లు కొని తెచ్చుకున్నట్లే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత్ కిషోర్ [more]
వరస విజయాలు సాధించి పెడుతున్న వారెవరినైనా లైట్ గా తీసుకోరు. అలా తీసుకుంటే వాళ్ల ఓటమిని వాళ్లు కొని తెచ్చుకున్నట్లే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత్ కిషోర్ విషయంలోనూ అదే జరుగుతుంది. వైసీపీ మరోసారి ప్రశాంత్ కిషోర్ టీం సేవలను వినియోగించుకుంటుందన్న వార్తలు వచ్చాయి. దీనిని టీడీపీ నేతలు, అనుకూల మీడియా లైట్ గా తీసుకుంటున్నట్లు బయటకు చెబుతున్నా పీకే జ్వరం మాత్రం వాళ్లను పట్టుకుందనే చెప్పాలి.
ట్రాక్ రికార్డ్ చూస్తే….
ప్రశాంత్ కిషోర్ ట్రాక్ రికార్డ్ చూసిన వారెవరైనా ఆయనను సులువుగా తీసిపారేయరు. ఏపీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ, పశ్చిమబెంగాల్, తమిళనాడు వరకూ ఆయన ప్రాంతాలకు అతీతంగా ప్రాంతీయ పార్టీలకు విజయాన్ని తెచ్చి పెట్టారు. అక్కడి పార్టీ అధినేతల ప్రభావం చాలా వరకూ ఉన్నా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పదిశాతమైనా పనిచేసి విజయాలను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అదే ఏపీలోని విపక్ష పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
పీకే టీం రాకతో….
ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ పేరును ప్రస్తావించా రంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ టీం సేవలను వినియోగించుకుంటామని జగన్ చెప్పారు. దీంతో ప్రశాంత్ కిషోర్ పై మాటల దాడి మొదలయింది. బీహారీ పీకే వ్యూహాలు ఇక్కడ చెల్లవని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తొలగించడం ప్రశాంత్ కిషోర్ కు ఈసారి సాధ్యపడదని టీడీపీ నేతలు చెబుతున్నారు.
వైసీపీ నేతల్లోనూ….
ప్రశాంత్ కిషోర్ టీం మరోసారి తమకు విజయం సాధించిపెడుతుందని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఆయన వ్యూహాల ప్రకారం వెళ్లేందుకే వైసీపీ మరోసారి సిద్ధమయింది. అయితే పీకే టీం సర్వేలు చేసి ఎక్కడ తమకు టిక్కెట్ల విషయంలో అడ్డుపడుతుందోనన్న ఆందోళన కూడా వైసీపీ నేతల్లో కన్పిస్తుంది. మొత్తం మీద ఇటు అధికార పార్టీ వైసీపీలోనూ, విపక్ష టీడీపీలోనూ పీకే ఫీవర్ పట్టుకుందనే చెప్పాలి.