Prasanth kishore : జగన్ కాదట.. వాళ్ల టార్గెట్ పీకేనే
రాజకీయాల్లో అన్ని పార్టీలకూ వ్యూహాలు అవసరం. కానీ తమ వ్యూహాలను దెబ్బతీసే వారినే మొదట లక్ష్యంగా ఎంచుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కంటే ప్రశాంత్ కిషోర్ [more]
రాజకీయాల్లో అన్ని పార్టీలకూ వ్యూహాలు అవసరం. కానీ తమ వ్యూహాలను దెబ్బతీసే వారినే మొదట లక్ష్యంగా ఎంచుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కంటే ప్రశాంత్ కిషోర్ [more]
రాజకీయాల్లో అన్ని పార్టీలకూ వ్యూహాలు అవసరం. కానీ తమ వ్యూహాలను దెబ్బతీసే వారినే మొదట లక్ష్యంగా ఎంచుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కంటే ప్రశాంత్ కిషోర్ టీంను ఇప్పడు విపక్ష నేతలు టార్గెట్ చేస్తున్నారు. వారి అనుకూల మీడియా సయితం రోజుకోసారి ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు గుప్పిస్తూ కథనాలను వండి వారుస్తుంది. జగన్ మంత్రి వర్గ సమావేశంలో పీకే టీం వస్తుందని చెప్పిన నాటి నుంచి మరింత జోరు పెంచారు.
ఆయన వల్లనే….
ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతోనే తాము 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని టీడీపీ గట్టిగా నమ్ముతుంది. జగన్ పై ప్రజలకు విశ్వాసం లేదని, పీకే టీం సోషల్ మీడియా ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన దుష్ప్రచారం కారణంగానే తమ పార్టీ ఓడిపోయిందని, లేకుంటే ఇంతటి దారుణమైన ఫలితాలు వచ్చి ఉండేవి కావన్నది టీడీపీ నేతల విశ్లేషణ. అందుకే ప్రశాంత్ కిషోర్ అంటేనే టీడీపీకి ఒళ్లు మంట. ఆయన పేరెత్తితేనే రగిలిపోతుంటారు.
అనుకూల మీడియా….
బీహార్ నుంచి వచ్చి ఏపీ రాజకీయాల్లో తమను దెబ్బకొట్టాడని ఇప్పటికీ రగిలిపోతుంటారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ తన టీంను పంపిస్తున్నారని తెలిసి ఇప్పటి నుంచే ఆయనను టీడీపీ, దాని అనుకూల మీడియా టార్గెట్ గా పెట్టుకున్నట్లు కన్పిస్తుంది. సినీనటు పోసాని కృష్ణమురళి పవన్ కల్యాణ్ పై చేసిన అభ్యంతర వ్యాఖ్యల వెనక కూడా ప్రశాంత్ కిషోర్ ఉన్నారంటూ జోరుగా ప్రచారం చేస్తుంది.
కులాల కంపును….
ఇక రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే ప్రశాంత్ కిషోర్ ప్రోద్బలంతోనే పోసాని ఆ కామెంట్స్ చేశారని వ్యాఖ్యానించడం విశేషం. బీహారీ సంస్కృతిని ఏపీలో ప్రవేశపెడుతున్నా రన్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియా అయితే అసలు ఏపీలో కులాల వారీగా విభజన చేసింది, కుల ఘర్షణలను తలెత్తేలా చేసిందంటూ ప్రశాంత్ కిషోర్ పై స్పెషల్ ఫోకస్ లను నడుపుతున్నాయి. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ టీం మరోసారి ఏపీలోకి అడుగు పెట్టకముందే టీడీపీకి కొంత దడ పుట్టిందనే చెప్పాలి.