Prasanth kishore : ఇక్కడ కదా బయటపడేది నీ సత్తా
ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరినైనా గెలిపిస్తారన్న నమ్మకం రాజకీయ వర్గాల్లో నెలకొని ఉంది. ఆయన హిస్టరీ అలా ఉంది. వరసగా విజయాలు నమోదు చేసుకుంటూ వెళుతున్న ప్రశాంత్ [more]
ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరినైనా గెలిపిస్తారన్న నమ్మకం రాజకీయ వర్గాల్లో నెలకొని ఉంది. ఆయన హిస్టరీ అలా ఉంది. వరసగా విజయాలు నమోదు చేసుకుంటూ వెళుతున్న ప్రశాంత్ [more]
ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరినైనా గెలిపిస్తారన్న నమ్మకం రాజకీయ వర్గాల్లో నెలకొని ఉంది. ఆయన హిస్టరీ అలా ఉంది. వరసగా విజయాలు నమోదు చేసుకుంటూ వెళుతున్న ప్రశాంత్ కిషోర్ కు మరో రెండేళ్లలో జరగనున్న తెలంగాణ ఎన్నికలు సవాల్ గా మారాయనే చెప్పాలి. ఇక్కడ వైఎస్ షర్మిలకు ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తుంది. అయితే ఇక్కడ షర్మిల గెలుపోటములపై ప్రశాంత్ కిషోర్ సమర్థత ఆధారపడి ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
సక్సెస్ రేటు చూస్తే….
ఇప్పటి వరకూ ప్రశాంత్ కిషోర్ అనేక రాష్ట్రాల్లో తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి ప్రాంతీయ పార్టీలను గెలిపించారు. ముఖ్యమంత్రులు చేశారు. ఏపీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచించాయి. తమిళనాడును పక్కన పెడితే పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ పై ఉన్న వ్యతిరేతకను పక్కకు నెట్టి ఆమెకు ఫుల్లు మెజారిటీని ప్రశాంత్ కిషోర్ సంపాదించి పెట్టారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఆయన పలుకుబడి బాగా పెరిగింది.
ఇక్కడ గెలవడం…
అయితే తెలంగాణలో వైఎస్ షర్మిలకు ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తుంది. ఇక్కడ ఎన్నికల్లో వైఎస్ షర్మిల పార్టీని గట్టెక్కించడం అంత సులువు కాదు. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. వైఎస్ షర్మిల ఏపీ మూలాలున్న వ్యక్తి కావడంతో ఇక్కడి ప్రజలు ఆమెను ఆదరిస్తారా? అన్న అనుమానం లేకపోలేదు. ఇప్పటికీ పార్టీకి బలమైన నేతలు ఎవరూ లేరు.
పది స్థానాలను గెలిచినా…..?
తాను గెలవడం కోసం ప్రశాంత్ కిషోర్ టీంతో వైఎస్ షర్మిల ఒప్పందం చేసుకున్నారు. తాను ఈ నెల20 నుంచి ప్రారంభించబోయే పాదయాత్రను కూడా ఆ టీం ప్లాన్ చేస్తుంది. మరి అన్ని రకాలుగా పూర్తిగా దిగువన ఉన్న వైఎస్సార్టీపీని ప్రశాంత్ కిషోర్ టీం ఏ రకంగా ముందుకు తీసుకు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గెలుపు సంగతి పక్కన పెడితే ఈ పార్టీకి పది స్థానాలు వచ్చినా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలించినట్లే అని అంటున్నారు.