పీకే దెబ్బతీయక మానడట
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఎదురుదెబ్బ ఆయన ఊహించనది. అన్ని రాష్ట్రాల నుంచి రాజకీయ పార్టీలు తనకు రెడ్ కార్పెట్ పరుస్తుంటే నితీష్ కుమార్ తనపై [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఎదురుదెబ్బ ఆయన ఊహించనది. అన్ని రాష్ట్రాల నుంచి రాజకీయ పార్టీలు తనకు రెడ్ కార్పెట్ పరుస్తుంటే నితీష్ కుమార్ తనపై [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఎదురుదెబ్బ ఆయన ఊహించనది. అన్ని రాష్ట్రాల నుంచి రాజకీయ పార్టీలు తనకు రెడ్ కార్పెట్ పరుస్తుంటే నితీష్ కుమార్ తనపై వేటు వేయడాన్ని ప్రశాంత్ కిషోర్ తట్టుకోలేకపోతున్నారు. తనలాంటి ఎన్నికల వ్యూహకర్తను పోగట్టుకుని నితీష్ కుమార్ తన గొయ్యిని తానే తవ్వుకున్నారని కూడా సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నితీష్ కుమార్ కూడా పీకేతో వేగలేకనే వేటు వేశారన్నది జేడీయూ ఇన్నర్ సర్కిళ్లలో విన్పిస్తున్న టాక్.
తనమాటే నెగ్గాలని….
నిజానికి ప్రశాంత్ కిషోర్ ఏ డీల్ ఒప్పుకున్నా తన మాటే నెగ్గాలనుకుంటున్నారు. తాను చెప్పినట్లే నడుచుకుంటేనే విజయం వరిస్తుందని చెబుతారు. ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న తర్వాత జగన్ సూచనలు కూడా పీకే పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. దాదాపు వందకోట్ల పైగానే డీల్ కుదుర్చుకున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక నుంచి జగన్ పాదయాత్ర వరకూ ఆయన మాటే నెగ్గాలని పట్టుబట్టారు. ఒకదశలో జగన్ పీకేను వదిలించుకోవాలని చూశారు. కొంతకాలం అలిగి వెళ్లినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఆర్జేడీ ఆహ్వానం…..
ఇక ఇప్పటికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి ప్రశాంత్ కిషోర్ టీం సేవలను అందించడం ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో జేడీయూ ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ ను దూరం చేసుకుందంటే ఆయన ఏకపక్ష నిర్ణయాలే కారణమంటున్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను ప్రసన్నం చేసుకోవడానికి అదే రాష్ట్రంలోని ప్రధాన పార్టీ ఆర్జేడీ ప్రయత్నిస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
నితీష్ ను దెబ్బతీయడానికి….
బీహార్ లో అతి ముఖ్యమైన పార్టీ ఆర్జేడీ ప్రశాంత్ కిషోర్ ను ఆహ్వానించింది. ఆయన అంగీకరిస్తే తాము పార్టీలో చేర్చుకుంటామని లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు ట్వీట్ చేశారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ను తమ వైపు తిప్పుకునేందుకు ఆర్జేడీ కొందరు నేతలను రంగంలోకి దించింది. ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీ వైపు మొగ్గుచూపుతారన్న ప్రచారం జరుగుతుంది. తనను అవమానించిన నితీష్ ను ఆయన ప్రత్యర్థితో చేతులు కలిపి దెబ్బకొట్టాలని ప్రశాంత్ కిషోర్ యోచిస్తున్నాడని సమాచారం. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ నితీష్ పై పగ తీర్చుకునేందుకే సిద్ధమయ్యారు.