పీకే లేకుంటే ఎన్నికలే లేవా?
ఎన్నికలొస్తే ప్రశాంత్ కిషోర్ గుర్తొస్తాడు. ఎన్నికల్లో విజయం సాధించిపెట్టే పర్సంటేజీ ఆయనలో ఎక్కువగా ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో [more]
ఎన్నికలొస్తే ప్రశాంత్ కిషోర్ గుర్తొస్తాడు. ఎన్నికల్లో విజయం సాధించిపెట్టే పర్సంటేజీ ఆయనలో ఎక్కువగా ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో [more]
ఎన్నికలొస్తే ప్రశాంత్ కిషోర్ గుర్తొస్తాడు. ఎన్నికల్లో విజయం సాధించిపెట్టే పర్సంటేజీ ఆయనలో ఎక్కువగా ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ కు ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ ఆ తర్వాత పంజాబ్ వంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ బిజీగా మారనున్నాడు.
ఏపీలో గెలుపుతో…..
ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ 2019 లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాకర్తగా నిలిచారు. ఆ పార్టీకి ఆ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగింది. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వన్ సైడ్ విజయం నమోదు చేసుకుంది.
తమిళనాడులోనూ…..
దీంతో ప్రశాంత్ కిషోర్ వైపు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయి. తమిళనాడులో ఇప్పటికే డీఎంకే ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు మరో మూడేళ్లు ఉన్నప్పటకీ కర్ణాటకలో జనతాదళ్ ఎస్ అధినేత కుమారస్వామి కూడా ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలనుకున్నారు.
పశ్చిమ బెంగాల్… పంజాబ్ లోనూ….
ఇప్పటికే త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తరుపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. మమత బెనర్జీతో ఆయన టీం ఇప్పటికే కనెక్ట్ అయి సేవలందిస్తోంది. ఇక ప్రశాంత్ కిషోర్ తాజాగా పంజాబ్ లోనూ జాతీయ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. పంజాబ్ కు మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిర్ణయించారు. పంజాబ్ లో కాంగ్రెస్ తరుపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారన్నమాట.