పీకే పాచిక ఇక్కడ పారదట
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్ అయ్యారు. దేశమంతటా రాజకీయ వర్గాల్లో ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోయింది. ఏపీ, ఢిల్లీ వరస విజయాలతో సూపర్ పవర్ పేరు [more]
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్ అయ్యారు. దేశమంతటా రాజకీయ వర్గాల్లో ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోయింది. ఏపీ, ఢిల్లీ వరస విజయాలతో సూపర్ పవర్ పేరు [more]
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్ అయ్యారు. దేశమంతటా రాజకీయ వర్గాల్లో ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోయింది. ఏపీ, ఢిల్లీ వరస విజయాలతో సూపర్ పవర్ పేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ కు ముందు ముందు పెద్ద సవాల్ ఉందంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మమత బెనర్జీ గెలుపు పెద్ద కష్టమేమీ కాదు. ప్రశాంత్ కిషోర్ కంటే ఇక్కడ మమత బలమే విజయానికి కారణాలుగా చెప్పాలి.
తమిళనాడు ఎన్నికల్లో….
ఇక ప్రశాంత్ కిషోర్ తమిళనాడుకు వెళ్లాల్సి ఉంటుంది. తమిళనాడులో 2021లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో డీఎంకే తరుపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చెల్లవంటున్నారు విశ్లేషకులు. తమిళనాడుది డిఫరెంట్ పాలిటిక్స్. ఇక్కడ కుల, మతాలకు అతీతంగా అభిమానమే నాయకులకు ఓట్లు తెచ్చిపెడుతుంది.
వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే…..
జయలలిత, కరుణానిధి వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే ఓట్లు తెచ్చిపెట్టింది. అన్నాడీఎంకే, డీఎంకే తప్పించి దశాబ్దాలుగా ఎవరూ అధికారంలోకి రాలేదు. ఇక్కడ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు నామమాత్రమే. ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో నిలబడాల్సి వస్తుంది. తమిళనాడులో సోషల్ మీడియా ప్రభావం కంటే వ్యక్తుల ఇమేజ్ మీదనే ఆధారపడతాయి. సినీనటులకు గుడులు కట్టి దేవుళ్లుగా ఆరాధించిన రాష్ట్రమిది.
రజనీ రాకతో….
తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో రజనీకాంత్ రంగంలో ఉండనున్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా రజనీకాంత్ బరిలో ఉన్నారు. ఫ్యాన్స్ బలంతో పాటు ఆయనంటే ప్రేమాభిమానులు ఎక్కువ ఉన్న వారు తమిళనాడులో అధికమే. ఈ ఈ పరిస్థితులను ప్రశాంత్ కిషోర్ ఎలా అధిగమిస్తారన్నది బిగ్ క్వశ్చన్. సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ టీం ఎంత డీఎంకేను వెనకేసుకొచ్చినా ఓట్లు రాలకపోవచ్చన్న అభిప్రాయం వినపడుతోంది. మరి స్టాలిన్ ను గెలిపించుకోవడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. ప్రశాంత్ కిషోర్ సత్తా ఏంటో తమిళనాట తేలుతుందంటున్నారు.