ప్రశాంత్ కిషోర్ ను ఇక పట్టుకోలేముగా?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మరోసారి క్రేజ్ పెరిగేలా ఉంది. ఆయనకు దేశ వ్యాప్తంగా మరింత డిమాండ్ పెరిగే అవకాశముంది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్ [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మరోసారి క్రేజ్ పెరిగేలా ఉంది. ఆయనకు దేశ వ్యాప్తంగా మరింత డిమాండ్ పెరిగే అవకాశముంది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్ [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మరోసారి క్రేజ్ పెరిగేలా ఉంది. ఆయనకు దేశ వ్యాప్తంగా మరింత డిమాండ్ పెరిగే అవకాశముంది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ట్రెండ్ నడుస్తుంది. వరస విజయాలతో ప్రశాంత్ కిషోర్ చుట్టూ రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీల దెబ్బకు కుదేలయిపోయిన ప్రాంతీయ పార్టీలన్నీ ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నాయి.
అనేక చోట్ల…..
ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ రెండు చోట్ల ప్రాంతీయ పార్టీలకు విజయాలను అందించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. 151 స్థానాలు రావడం వెనక వ్యూహకర్త వ్యూహలు ఉన్నాయంటున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సోషల్ మీడియా ప్రచారం వరకూ ప్రశాంత్ కిషోర్ టీం చూసుకుంటుండటంతో డబ్బులు పోయినా రాజీకీయ పార్టీల అధినేతలకు చాలా టెన్షన్ లు తప్పి పోయాయి.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో…..
ఢిల్లీలోనూ అరవింద్ కేజ్రీవాల్ ను మరోసారి అధికారంలోకి తేవడంలోనూ ప్రశాంత్ కిషోర్ ముఖ్యపాత్రను పోషించారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు, తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకేకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి రెండంకెల సీట్లు దాటితే తాను ట్విట్టర్ నుంచి తొలుగుతానని ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు.
రెండింటా విజయమే…?
అంతే ఆయన అంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ అంచానాలకు అనుగుణంగానే ఏబీపీ, సీ-ఓటరు ఓపీనియన్ పోల్ కూడా ఇదే తేల్చింది. పశ్చిమ బెంగాల్ లో 148 నుంచి 164 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. తమిళనాడులో డీఎంకే కూటమికి 154 నుంచి 162 సీట్లు వచ్చే అవకాశముందని తేల్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో టీఎంసీ, డీఎంకే గెలిస్తే ప్రశాంత్ కిషోర్ కు మరింత డిమాండ్ పెరిగే అవకాశముంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.