ప్రత్తిపాటి పూర్తిగా దూరమయినట్లేనా?
తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ నేతలు మొహం చాటేస్తున్నారు. కనీసం పార్టీకి అండగా నిలబడాలన్న స్పృహ కూడా నేతల్లో లేదు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులను [more]
తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ నేతలు మొహం చాటేస్తున్నారు. కనీసం పార్టీకి అండగా నిలబడాలన్న స్పృహ కూడా నేతల్లో లేదు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులను [more]
తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ నేతలు మొహం చాటేస్తున్నారు. కనీసం పార్టీకి అండగా నిలబడాలన్న స్పృహ కూడా నేతల్లో లేదు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులను వెలగబెట్టిన నేతలు ఇప్పుడు ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కనీసం తమ నియోజకవర్గాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.
కేసులు, ఓటములు….
వరసగా టీడీపీ నేతలపై కేసులు నమోదవుతుండటం, వరస ఓటములతో అనేక మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తమ జిల్లాకు చెందిన నేతలపై కూడా కేసులు నమోదయినా కూడా స్పందిచడం లేదు. గుంటూరు జిల్లాకు చెందిన ధూళ్లిపాళ్ల నరేంద్ర అరెస్ట్ అయి జైలుకు వెళ్లినా ప్రత్తిపాటి పుల్లారావు స్పందించలేదు. గుంటూరు టౌన్ లో చంద్రబాబుపై కేసు నమోదయినా ఆయన పట్టించుకోకపోవడం విశేషం.
కీలకపాత్ర పోషించి….
ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబు మంత్రివర్గంలో కీలక భూమిక పోషించారు. అమరావతి భూముల వ్యవహారంలో నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు అంతా తామే అయి వ్యవహరించారు. చంద్రబాబు, లోకేష్ లకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని పూర్తిగా ప్రత్తిపాటి పుల్లారావు పక్కన పెట్టేశారు. చిలకలూరి పేట నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ కు కూడా అందుబాటులో లేకుండా పోయారు.
బాబు సీరియస్…..
పూర్తిగా ప్రత్తిపాటి పుల్లారావు హైదరాబాద్ కే పరిమితమయి తన వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇప్పటికే చిలకలూరిపేటలో ముఖ్యనేతలు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా ప్రత్తిపాటి పుల్లారావు విషయంలో సీరియస్ గా ఉన్నారని తెలిసింది. అమరావతి రాజధాని విషయంలోనూ ఆయన పట్టించుకోకపోవడం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో చంద్రబాబు ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.