తెలుగు రాష్ట్రాల్లో రెండు ఎన్నికలు… జగన్, కేసీఆర్‌లో హై టెన్షన్ ?
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలతో పాటు రెండు తెలుగు [more]
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలతో పాటు రెండు తెలుగు [more]
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే రానుందని తెలుస్తోంది అయితే.. ఇతర రాష్ట్రాల పరిస్థితిని పక్కనపెడితే..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు అధికార పార్టీలు టీఆర్ఎస్, వైసీపీల్లో కొత్త టెన్షన్‌కు కారణంగా మారాయి. ఈ ఉప పోరులో గెలిస్తే.. రెండు ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటాయి. లేకపోతే..వ్యతిరేకత పెరిగిందనే అంచనాలు ఖాయం.
కేసీఆర్ కు సాగర్ టెన్షన్….
తెలంగాణ: ఈ రాష్ట్రంలో త్వరలోనే నాగార్జున సాగర్ అసెంబ్లీస్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ తరఫున గెలిచిన నోముల నరసింహయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా అధికార పార్టీ సిట్టింగ్ సీటు కోల్పోయింది. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీఆర్ ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేయర్ పీఠాన్ని దక్కించుకున్నా.. ప్రతిపక్షాలు బలపడ్డాయి. దీంతో కేసీఆర్ సాగర్‌లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. దుబ్బాక ఉప ఎన్నికను పూర్తి లైట్‌గా తీస్కొన్న కేసీఆర్ సాగర్ లో మాత్రం అప్పుడే ఓ రౌండ్ చుట్టేశారు. సాగర్‌లో కనుక గెలుపు గుర్రం ఎక్కక పోతే.. కేసీఆర్‌కు వ్యతిరేకత ప్రారంభమైందనే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. దీంతో ఇక్కడ సాగర్ టెన్షన్ పీక్ కు చేరింది.
తిరుపతి ఉప ఎన్నికలో….
ఏపీ విషయానికి వస్తే.. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ నుంచి 2019లో విజయం సాధించిన బల్లి దుర్గా ప్రసాద్.. కూడా కరోనాతో మృతి చెందారు. త్వరలోనే ఇక్కడ ఎన్నిక జరగనుంది. ఇది వైసీపీకి సిట్టింగ్ స్థానం. ఇప్పటి వరకు నాలుగుదశల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ పంచాయతీలు సాధించిందని చెబుతున్నా.. ఆశించిన విధంగా 90 శాతం ఏకగ్రీవాలు సాధించలేక పోయింది. అదేసమయంలో త్వరలోనే మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఇక్కడ ఓటరు నాడి కూడా పార్టీని భయపెడుతోంది. నగర పోరులో కూడా ఫలితాలు అనుకున్నట్టు వచ్చే అవకాశం లేదని ఇప్పటికే అంచనాలు వస్తున్నాయి.
ఎక్కువ మెజారిటీ రాకున్నా…..
ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంటు స్థానం దక్కించుకోవడంపై పార్టీ అంతర్మథనం పడుతోంది. ఇప్పటి వరకు అభ్యర్థిని కూడా ప్రకటించకపోవడం గమనార్హం. ఒకవేళ ఈ స్థానంలో ఫలితం అనుకున్న స్థాయిలో రాకపోతే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్రస్థాయిలో బెడిసికొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ గెలిచినా.. గత 2014, 2019 ఎన్నికలకంటే ఎక్కువగా మెజారిటీ రావాలి. లేక పోతే.. అది కూడా ఇబ్బందికర పరిణామమే అవుతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్టుగానే భావించాలని అంటున్నారు. దీంతో అటు తెలంగాణ, ఇటు ఏపీల్లో టెన్షన్ ప్రారంభమైందనే చెప్పాలి.