వామ్మో ఇలాగయితే ఎలా? తట్టుకోగలమా?
కరోనా వైరస్ వ్యాప్తి మహారాష్ట్రలో ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు ఇరవై వేలకుపైగానే కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]
కరోనా వైరస్ వ్యాప్తి మహారాష్ట్రలో ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు ఇరవై వేలకుపైగానే కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]
కరోనా వైరస్ వ్యాప్తి మహారాష్ట్రలో ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు ఇరవై వేలకుపైగానే కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలకు పైగానే ఉంది. ఇది ఆందోళన కల్గించే విషయమే. కరోనా వైరస్ భారత్ లో ప్రవేశించిన నాటి నుంచి మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలోనే ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం ఫలితం ఇవ్వడం లేదు.
పెద్ద సమస్యగా మారి……
అతి పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రకు కరోనా పెద్ద సమస్యగా తయారయింది. ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరువలో ఉండటం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. మహారాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచి కరోనా కట్టడికి చేయని ప్రయత్నాలు లేవు. మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి కరోనా వ్యాప్తి తొలుత జరిగింది. వీరిని గుర్తించి క్వారంటైన్ కు పంపే సమయంలోనే వలస కార్మికుల సమస్య తలెత్తింది.
లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత….
ఇక లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కరోనా వైరస్ మరింత ఎక్కువయింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చారు. ఉద్ధవ్ థాక్రే కొంత లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చేందుకు కొంత సంకోచించినా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మినహాయింపులు ఇవ్వాల్సి వచ్చింది. వ్యాపార వర్గాలు శరద్ పవార్ పై వత్తిడి తేవడం వల్లనే అడ్డగోలుగా వ్యాపారసంస్థలను తెరవడంతో కేసుల సంఖ్య మరింత పెరిగిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ…..
ఇక ముంబయి, పూనే, థానే. నాగపూర్ నగరాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. తొలినాళ్లలో ముంబయిని కరోనా వైరస్ వణికించింది. ప్రస్తుతం పూనే లో లక్షకు పైగానే కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 80 వేల మంది కరోనా తో మరణిస్తే ఒక్క మహారాష్ట్రలోనే 30 వేల మంది మరణించడం కూడా ఆందోళన కల్గిస్తుంది. నగరాల్లోనే కాకుండా రూరల్ ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటుంది. మరి కరోనాతో విలవిలలాడుతున్న మహారాష్ట్ర ఎలా బయటపడుతుందనేది చూడాలి.