ఎంపీలు ఇక దేనికీ పనికిరారని డిసైడ్ అయ్యారా?
ఒకరు కాదు ఇద్దరు కాదు గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు లోక్‌సభకు ఎంపికయ్యారు. వీరందరూ కూడా పార్టీ నేతల అసమ్మతి జ్వాలల్లో [more]
ఒకరు కాదు ఇద్దరు కాదు గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు లోక్‌సభకు ఎంపికయ్యారు. వీరందరూ కూడా పార్టీ నేతల అసమ్మతి జ్వాలల్లో [more]
ఒకరు కాదు ఇద్దరు కాదు గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు లోక్‌సభకు ఎంపికయ్యారు. వీరందరూ కూడా పార్టీ నేతల అసమ్మతి జ్వాలల్లో నలిగిపోతున్నారు. ఎవరో ఒకరో ఇద్దరు మినహా అందరు ఎంపీలు సొంత పార్టీ మంత్రులో లేదా ఎమ్మెల్యేల నుంచో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ ఇంటర్నల్ వార్‌లో తప్పొప్పులు ఎవరివి అన్నది పక్కన పెడితే ఎంపీలకు మాత్రం సెగలు తప్పడం లేదు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు స్థానిక ఎమ్మెల్యేలకు పడడం లేదు. చివరకు అక్కడ ఎంపీని డమ్మీని చేసి ఎమ్మెల్యేలు, విజయసాయే పెత్తనం అంతా చేసేస్తున్నారు. దీంతో ఎంవీవీ రగులుతున్నారు. అనకాపల్లి ఎంపీ సత్యవతికి స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు పొసగడం లేదు.
కూల్ వాటర్ పోసినా…?
ఇక గోదావరి జిల్లాల్లో ఐదుగురు ఎంపీలకు సొంత పార్టీ నేతల నుంచి మామూలు సెగలేదు. కాకినాడ ఎంపీ వంగా గీత సైలెంట్‌గానే ఉన్నా ఆమె స్థానికంగా కొందరు ఎమ్మెల్యేలు తనకు ప్రయార్టీ ఇవ్వడం లేదని రగులుతున్నారు. ఇక ఆమె పిఠాపురంపై కన్నేశారన్న వార్తల నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యే దొరబాబును ఆమెను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసేశారట. ఇక అమలాపురం ఎంపీ చింతా అనూరాధకు మంత్రి విశ్వరూప్‌కు కూల్ వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. ఆమెకు మరో మంత్రి చెల్లుబోయిన వేణుతో పాటు రాజోలు పార్టీ నేతలకు కూడా పడట్లేదు.
గ్రూపులుగా ఏర్పడి…..
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పడట్లేదు. భరత్‌కు కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజాకు మధ్య విబేధాలు తీవ్రమయ్యాయి. పశ్చిమ గోదావరిలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథర్‌కు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు పెద్ద యుద్ధమే నడుస్తోంది. స్థానిక ఎన్నికల్లోనూ ఒకే పార్టీ నుంచి వీరిద్దరి గ్రూపులు పోటీ చేశాయి. మంత్రి ఆళ్ల నానితోనూ శ్రీథర్‌కు గ్యాప్ ఉందంటున్నారు. ఇక నరసాపురం ఎంపీ ఏకంగా పార్టీ అధిష్టానంపైనే యుద్దం ప్రకటించి స్థానిక పార్టీ నేతలకు దూరమైపోయారు.
అందుకే సైలెంట్ గా….
బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌కు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి మధ్య ఓపెన్ వార్ నడుస్తుండగా… అదే జిల్లాలోని నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులుకు చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో పెద్ద యుద్ధం నడుస్తోంది. ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మంత్రి బాలినేనికి ఆయనకు ఏ మాత్రం సఖ్యత లేదు. నెల్లూరు ఎంపీ ఆదాలకు కొందరు ఎమ్మెల్యేలతో గ్యాప్ ఉన్నా ఆయన సైలెంట్‌గా ఉన్నారు.
రాయలసీమలోనూ…..
రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి మదనపల్లి ఎమ్మెల్యేకు పడట్లేదు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గానికి వ్యతిరేకంగా 15 పంచాయతీల్లో ఎంపీ వర్గం పోటీ చేసిందని గుర్రుగా ఉన్నారు. ఇదే మిథున్‌రెడ్డితో తన నియోజకవర్గ పరిధిలో ఉన్న మరో కీలక ఎమ్మెల్యేతోనూ పడట్లేదు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి మంత్రి అంజాద్‌కు పడకపోయినా మంత్రి కిమ్మనలేని పరిస్థితి. ఉన్నంతలో కర్నూలు ఎంపీలకు లోపల ఎలా ఉన్నా పైకి సెగలేవి బయట పడట్లేదు. అనంతపురంలోనూ ఎంపీలకు సెగలు తప్పడం లేదు. అనంత ఎంపీ రంగయ్యకు ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, ఉషా చరణ్‌తో వార్ నడుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యేకు పెనుగొండ, హిందూపురం ఎమ్మెల్యేలతో వార్ ఉంది. ఏదేమైనా వైసీపీ ఎంపీల్లో 90 శాతం మంది సొంత పార్టీ నేతల నుంచే సెగలు ఎదుర్కొంటున్నారు. వీరిలో కొందరు తమ తప్పులేకపోయినా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.
- Tags
- mp
- à°à°à°ªà±