ప్రియాంక ఫోకస్ అందుకేనా?
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు 2022లో జరగనున్నాయి. అంటే ఇకా రెండేళ్ల సమయం ఉంది. అయితే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మాత్రం ఉత్తర్ ప్రదేశ్ పైనే దృష్టి [more]
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు 2022లో జరగనున్నాయి. అంటే ఇకా రెండేళ్ల సమయం ఉంది. అయితే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మాత్రం ఉత్తర్ ప్రదేశ్ పైనే దృష్టి [more]
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు 2022లో జరగనున్నాయి. అంటే ఇకా రెండేళ్ల సమయం ఉంది. అయితే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మాత్రం ఉత్తర్ ప్రదేశ్ పైనే దృష్టి పెడుతున్నారు. గత లోక్ సభ ఎన్నికల నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ ఫోకస్ అంతా ఉత్తర్ ప్రదేశ్ పై ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన అవమానాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది. అమేధీలో రాహుల్ గాంధీ ఓటమి ఆ పార్టీకి గుణపాఠమయింది. దీంతో ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
రెండేళ్ల తర్వాత….
రెండు సంవత్సరాల్లో జరగనున్న ఎన్నికలకు ఇప్పట ి నుంచే ప్రియాంక గాంధీ క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 403 స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపోటములు ప్రియాంకపైనే ఆధారపడి ఉన్నాయి. దీంతో ప్రియాంక గాంధీ యాక్టివ్ అయ్యారు. ఏ చిన్న సంఘటన జరిగినా ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. కరోనా సమంయలో ప్రజల కష్టాలను గుర్తించిన ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు లేఖ రాశారు. పేద, మధ్యతరగతి ప్రజలను ఈ సమయంలో ఆదుకునేందుకు పలు సూచనలు చేశారు.
ఒంటరిగా పోటీ చేయక తప్పదు….
ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి. కలసి పోటీ చేస్తే కాంగ్రెస్ కు కలసి రావడం లేదు. 1996 ఎన్నికలలో కాంగ్రెస్, బీఎస్పీ కలసి పోటీ చేసినా విజయం సాధించలేకపోయాయి. 2017 ఎన్నికలలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పొత్తును ప్రజలు పట్టించుకోలేదు. పార్లమెంటు ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తును కూడా ప్రజలు తిరస్కరించారు. దీంతో ఎస్పీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి.
సంప్రదాయక ఓటు బ్యాంకును…
ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు దాదాపు పదిశాతం సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేస్తేనే ఖాతాలో పడుతుంది. లేకుంటే చీలిపోతుంది. వీరంతా ఉన్నత కులాలు, బ్రాహ్మణ వర్గాలకు చెందిన వారు కావడంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలకు ఓటు వేయడం మానుకున్నారు. పొత్తులతో కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు మళ్లడం ఆందోళన కల్గిస్తుంది. అందుకోసం ప్రియాంక గాంధీ ఇప్పుడు తీవ్రంగా శ్రమిస్తన్నారు. కోల్పోయిన ఓటు బ్యాంకు ను తిరిగి తెచ్చుకోవడం, క్యాడర్ ను పటిష్టపర్చడం ఆమె ముందున్న లక్ష్యాలు. అందుకే ఉత్తర్ ప్రదేశ్ పై రెండేళ్ల ముందు నుంచే ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టారు.