ఎస్ సార్ అంటారా …? తేల్చుకుంటారా …?
లాక్ డౌన్ మొదలు అయ్యాక ముఖ్యమంత్రులతో ఐదోసారి సమావేశానికి సిద్ధం అయ్యారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకోవడం వైరస్ [more]
లాక్ డౌన్ మొదలు అయ్యాక ముఖ్యమంత్రులతో ఐదోసారి సమావేశానికి సిద్ధం అయ్యారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకోవడం వైరస్ [more]
లాక్ డౌన్ మొదలు అయ్యాక ముఖ్యమంత్రులతో ఐదోసారి సమావేశానికి సిద్ధం అయ్యారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకోవడం వైరస్ కట్టడిపై దిశానిర్ధేశం చేయడం పిఎం నరేంద్ర మోదీ సిఎం లతో భేటీ లో ముఖ్య అంశం. అయితే కేంద్రం నుంచి ఆశించిన మేరకు ఆర్ధిక సహకారం లేకపోవడం రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలచివేస్తుంది. లాక్ డౌన్ మూడో దశ నుంచి నాలుగోదశకు చేరుకుంటున్నా ప్రధాని కరుణించడం లేదన్నది వీరి ఆవేదన. తగిన విధంగా నిధులైనా ఇవ్వండి లేదా అప్పు లైనా తీసుకోవడానికి అనుమతి అయినా ఇవ్వండి అంటూ సిఎం లు మొత్తుకుంటున్నా మోడీ ఈ చెవి తో విని ఆ చెవితో వదిలేస్తున్నారు.
భేటీ ఆసక్తికరం …
సోమవారం ముఖ్యమంత్రులతో మోడీ భేటీ ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ కోసం ప్రధాని ఏమి చెప్పనున్నారు.. ? ఉద్దీపన ప్యాకేజీ పై పెదవి విప్పుతారా ? రాష్ట్రాలు కోరుకున్న విధంగా ఆర్ధికంగా ఆదుకోవడానికి ప్రధాని ఏమి చెప్పనున్నారు. లాక్ డౌన్ మినహాయింపులు ఏమి ఇవ్వనున్నారు ? కేవలం ఇరు వర్గాల ప్రసంగాలకే ఈ భేటీ మిగిలిపోనుందా ? ఇలా అనేక కీలక అంశాలు పై సర్వత్రా చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రధాని మోదీ భేటీ లో ముఖ్యమంత్రులు తమ బాధలు విన్నవించుకున్నారు. దీనిపై ఏదో ఒకటి చేసి ఆదుకోవాలని పదేపదే చెప్పుకున్నారు. అయినా ఇప్పటికి కేంద్రం ఎస్, కానీ నో కానీ చెప్పలేదు. దాంతో ప్రధాని ముందు మరింత గట్టిగా సిఎం లు చెప్పుకుంటారా లేక చెప్పింది వింటారా అన్నది చూడాలి.